బోధనారుసుముల చెల్లింపులో ఆలస్యం

సకాలంలో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు
నిజామాబాద్‌,అక్టోబర్‌4 (జనంసాక్షి):   ఉన్నత విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు సకాలంలొ అందకపోవడంతో వారు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు.  ప్రభుత్వం బోధనా రుసుంలను  చెల్లిస్తుండటంతో అనేకులు ప్రైవేటు సంస్థల్లో వృత్తి విద్య కోర్సుల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. అయితే… నిధుల మంజూరులో జాప్యం కారణంగా విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొత్త సంవత్సరం మొదలయినా  బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమకాకపోటంతో అవస్థలు పడుతున్నారు. బోధనా రుసుంల బకాయిలు కూడా రాకపోవడంతో కలవరపడుతున్నారు. ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో అత్యధికంగా బీసీ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, బోధనా రుసుంలకు సంబంధించి బకాయిలు  విడుదలచేయాల్సి ఉంది. ఉపకార వేతనాల కోసం దరఖాస్తుదారులకు ఆధార్‌ తప్పని చేశారు. విద్యార్థులు కొత్తగా ఆధార్‌ కోసం నమోదు చేసుకున్న సమయంలో చిన్న వయస్సులో ఉండటం, ఇప్పుడు పెద్దవారు కావటంతో చాలామందివి వేలిముద్రలు మారాయి. ప్రస్తుతం వేలిముద్రతో వారి ఆధార్‌కు ఆనుసంధానం కావడంలేదు. ఫలితంగా చాలామంది దరఖాస్తులు అనుమతి పొందని పరిస్థితి నెలకొంది. ఇలాంటి కేసుల విషయంలో ప్రభుత్వం స్పందించి ఆదార్‌ కార్డు సరిచేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించకుంటే వారికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇ/ూలాంటి పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు సకాలంలో అందించాలి. ఉపకార వేతనాలు సమయానికి అందిస్తే అవసరమైన పుస్తకాలు, ఇతర అధ్యయన సామగ్రి కొనుగోలు చేసుకోవడానికి వీలుంటుంది. బోధనా రుసుం బకాయిల విషయలోంనూ జాప్యం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సందించి న్యాయంచేయాలి.