బ్రిజిల్‌లో పడవ ప్రమాదం

12 మంది మృతి, 15 మంది గల్లంతు
రియో డి జానేరియో, (జనంసాక్షి) :
బ్రిజిల్‌లోని అమెజాన్‌లో గల అరిరి నదిలో శనివారం పడవ ముగిని 12 మంది మృతిచెందగా, 15 మంది గల్లంతయ్యారు. కల్నల్‌ ఆల్బెర్టో మోరిరా రైస్‌ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 70 మంది ప్రయాణికులతో బేలం నుంచి రాజధాని నాథర్న్‌ స్టేట్‌ ఆఫ్‌ పరాకు బయలుదేరిన విమానం ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయింది. ఆ సమయంలో  ప్రయాణికులు నిద్రలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రెండు హెలీక్యాప్టర్ల ద్వారా ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. 41 మందిని సురక్షితంగా వెలికి తీసి గాయపడిన తొమ్మిది మందిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. 49 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించే సామర్థ్యమున్న పడవలోకి కెప్టెన్‌ లూయిస్‌ ఇనాకో లిమా ఉద్దేశపూర్వకంగా ఎక్కువమందిని అనుమతించడం వల్లే ప్రమాదం జరిగినట్లు కల్నల్‌ రయిస్‌ తెలిపారు. 12 మంది మృతదేహాలను వెలికి తీసామని, మృతుల్లో చిన్నారి కూడా ఉన్నారని తెలిపారు. గల్లంతయిన 15 మంది ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పేర్కొన్నారు.