బ్లాస్టింగ్‌తో దద్దరిల్లుతున్న పల్లెలు
ఎల్కతుర్తి,మే 27, (జనంసాక్షి)
మండలంలోని దామెర గ్రామ బోడ గుట్టను క్వారీ వ్యాపారులు బ్లాస్టింగ్‌లతో తొలుస్తుంంటే చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 8 సంవత్సరాల క్రితం గుత్తె దారులు గుట్టను లీజుకు తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాస్టింగ్‌ల వల్ల గుట్టపై ఉన్న కోతులు, కొండెంగలు దామెర , చింతలపల్లి తదితర గ్రామాల్లోకి చొరబడి నానా హంగామా సృష్టిస్తున్నాయి. గుట్టపైనుంచి మండల కేంద్రానికి ప్రత్యేకమైన రహదారి ఉన్నప్పటికి రవాణా అంత లారీలలో ,ట్రాక్టర్లలలో గ్రామ నడి బొడ్డునుంచి సాగుతుంది. దీంతో ఇండ్లు దుమ్ము ధూళితో నిండిపోయి తీవ్ర కాలుష్యం ఏర్పడుతుంది. ఆహార పదార్ధాలు దుమ్ముతో నిండిపోయి పలురకాల జబ్బులు వ్యాపిస్తున్నాయి. కావున క్వారీ రవాణాను గ్రామం మధ్యలోనుంచి నిలిపి వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.