భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ…

కేసముద్రం ఆగస్టు 7 జనం సాక్షి  / పట్టణంలో ఆదివారం రోజున ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా స్థానిక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ఉదయాన్నే పంచాయితీ పాలకవర్గం మరియు సిబ్బందితో కలిసి  గ్రామ బొడ్రాయి,ముత్యాలమ్మ గుడిలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో,సిరి సంపదలతో తులతూగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ బోనాల పండుగ సందర్భంగా పట్టణమంతా సందడి నెలకొన్నది.ఉదయం నుంచి మొదలు మహిళలు భక్తిశ్రద్ధలతో పాలు పెరుగు బెల్లం తో కలిపి వండిన అన్నం ను మట్టి,ఇత్తడి లేక రాగి కుండలలో (బోనం) తమ తలపై పెట్టుకుని డప్పుల చప్పుళ్లతో బయలుదేరి గుడి ప్రాంగణానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు.సుందరంగా అలంకరించిన ముత్యాలమ్మ గుడి,చుట్టుపక్కల ప్రాంతమంతా విద్యుత్ దీపాలతో శోభాయమానంగా పలువురిని ఆకట్టుకుంది.