భరతమాత గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం.

తొర్రూర్ 15 అక్టోబర్( జనంసాక్షి )
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం  91వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.బీజేపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆధ్వర్యంలో స్థానిక జయశంకర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం  చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య మాట్లాడుతూ అబ్దుల్ కలాం  జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అని తెలిపారు.భరతమాత గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అని కొనియాడారు.భారత శాస్త్ర సాంకేతిక రంగాల్లో కలాం  సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.క్షిపణి రంగంలో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు. ప్రపంచ ఖ్యాతి గాంచిన నాసా శాస్త్రవేత్తలు నివ్వెరపోయేలా భారత క్షిపణి రంగాన్ని అభివృద్ధి చేసిన అబ్దుల్ కలాం  భారత రక్షణ శాఖ కు ఎన్నో రకాల క్షిపణులను అందించి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా ప్రఖ్యాతి పొందారు అని తెలిపారు ‌మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి  ప్రోత్సాహంతో పోఖ్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించి భారతీయ శాస్త్రవేత్త ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు అని, కాలం  స్పూర్తి తో నేడు అనేక మంది యువకులు క్షిపణి రంగంలో సేవలు అందిస్తున్నారు అని తెలిపారు.కలాం  కలలను నిజం చేయాలని వారి ఆశయ సాధనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ  ధేశ వ్యాప్తంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను యువశాస్త్ర వేత్తలు గా తయారు చేయడం కోసం ఉన్నత పాఠశాలలో అటల్ టింకరిఃగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు.సాధారణ పేద కుటుంబానికి చెందిన కలాం  పేపర్ బాయ్ నుండి ధేశ అత్యున్నత స్థాయి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు అని వారి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు పరుపాటి రాం మోహన్ రెడ్డి,పూసాల శ్రీమాన్,జలగం వెంకన్న, మంగళపళ్ళి యాకయ్య, పైండ్ల రాజేష్, రాయపురం రాజకుమార్, జలగం రవి,కాగు నవీన్,గట్ల భరత్,వినయ్ శర్మ, నూకల నవీన్,గంధం రాజు,కె.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.