భవన నిర్మాణం రంగ కార్మికుల సమస్యలు పరిష్కారానికి ఐక్య పోరాటమే.

తొర్రూర్ 6సెప్టెంబర్( జనంసాక్షి )
 మార్గందేశవ్యాప్తంగా పలు నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కొట్లాదిమంది భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల సమస్యలు పరిష్కారానికి ఐక్య పోరాటమే మార్గమని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి అన్నారు. నేడు తొర్రూరులోని ఐఎఫ్టియు కార్యాలయంలో తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల మండల ప్రధమ మహాసభ సభకు ముఖ్యఅతిథి గా హాజరై రవి ప్రసంగించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి వేలకోట్లు పాలకుల దగ్గర నిల్వ ఉన్నాయని వాటిని ఆ కార్మికుల సంక్షేమానికి ఎందుకు ఖర్చు చేయడం లేదని అన్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ బోర్డు ఇస్తున్న నిధులను రెట్టింపు చేయాలని రవి డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోతే 15 లక్షలు సహజ మరణానికి ఐదు లక్షలు,కార్మికుడి కూతురు పెళ్లికి లక్ష రూపాయలు,డెలివరీ 50,000 ప్రమాదం జరిగితే లక్ష రూపాయలు కు తగ్గకుండా భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని రవి డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ల సాధన కోసం దశలవారీగా ఆందోళన చేయనున్నామని కార్మిక వర్గం పెద్ద ఎత్తున కలిసి రావాలని రవి పిలుపునిచ్చారు. సిపిఐ (ఎంఎల్ )ప్రజాపంద తొర్రూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముంజ oపల్లి వీరన్న* మాట్లాడుతూ గత మే డే సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి భవన నిర్మాణ కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు. హామీ అమలు కోసం ఉద్యమాలు తప్పవని అన్నారు.నూతన కమిటీ ఎన్నిక అనంతరం 7మందితో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా  వెంకన్న ఉపాధ్యక్షుడిగా రమేష్ ప్రధాన కార్యదర్శిగా కత్రోజు హరి సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్ కోశాధికారిగా బానోతు బాలు కార్యవర్గ సభ్యులుగా బుచ్చిరు సంకినేని వెంకన్న వంగూరు ముత్తయ్య తదితరులతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం పలు కార్మిక రంగ సమస్యలపై తీర్మానాలను ఆమోదించారు.