భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో దారి మల్లిన నిధులు కార్మికులకె ఖర్చు చేయాలి*
భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అద్యక్షలు గొరిగె సోములు*
*డిమాండ్స్ డే సందర్బంగా తహసిల్థార్ కార్యాలయం ముందు దర్నా*
రామన్నపేట నవంబర్ 15 (జనంసాక్షి) భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమయ్యారని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియ) జిల్లా అద్యక్షలు గొరిగె సోములు అన్నారు.భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై రాష్ర్ట వ్యాప్తంగా ఢిమాండ్స్ డే సందర్బంగా మండల తహసీల్థార్ కార్యాలయం ముందు మంగళవారం దర్నా నిర్వహించి అనంతరం మాట్లాడుతూ భవన కార్మికుల సంక్షేమ బోర్డుకు కేటాయించిన వేయి కోట్లు ప్రభుత్వం దారిమల్లించిందని అన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న కార్మికుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. భవన కార్మికులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు,మోటార్ సైకిళ్ళు అందివ్వాలి. అడ్డాల వద్ద ఉచిత బోజనం,మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి. పెంచిన స్టీల్,సిమేంట్,ఇసుక,కంకర ధరలను తగ్గించాలని,వయసు పైబడిన కార్మికులకు ప్రత్యేక పించన్ అందివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష,కార్యదర్శులు వంగాల మారయ్య,జుంపాల మహేష్,జిల్లా కోశాధికారి గాదె కృష్ణ,నాయకులు గొరిగె ఆదిమల్లయ్య,రాసాల రమేష్,వెంకట్ రెడ్డి,వడ్డెపల్లి ఎల్లయ్య,మేడి దుర్గేష్,వంగాల లక్ష్మయ్య,రామలింగం,కోయగూరిఋభి క్షం,కిరణ్,గాదె ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.