భవిష్యత్‌లోనూ జిల్లా అభివృద్దికి కృషి

ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు: మాజీమంత్రి
వికారాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): భవిష్యత్‌లో తనకు ఎలాంటి అవకాశం వచ్చినా జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని మాజీమంత్రి  మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మున్ముందు కూడా ఎలాంటి అవకాశం
లభించినా ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌లతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో రానున్న లోక్‌సభతో పాటు అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయాలన్నారు. కనీవినీ ఎరుగని విధంగా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టి రైతు అభివృద్ధితో పాటు గ్రావిూణ నిరుపేదల అభివృద్ధికి అనేక పథకాలు తీసుకవచ్చి ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనదైన ముద్ర వేశారని మహేదంర్‌ రెడ్డి అన్నారు.  సీఎం కేసీఆర్‌ పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు, మండలాలు, నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి అభివృద్ధి త్వరగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గ్రామాలు అభివృద్ధి జరిగేందుకు అధిక ప్రాధాన్యతనిస్తూ సర్పంచ్‌లకు సర్వాదికారాలు కట్టబెడుతూ హరిత హారంలో మొక్కలను పెంచే విధంగా అనేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గ్రామానికి సర్పంచే అన్ని విధాలుగా అభివృద్ధిలో నిర్ణయాలు తీసుకొని మోడల్‌ గ్రామ పంచాయతీలుగా రూపుదాల్చుకునే విధంగా అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఫించన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, కంటి వెలుగు, రైతు బంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ, 24గంటల ఉచిత విద్యుత్‌ ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దేశంలో కూడా మొన్న బ్జడెట్‌లో తెలంగాణ పథకాన్ని కాపీకొడుతూ కేంద్ర ప్రభుత్వం కూడా రైతుబంధు విధంగా పథకాన్ని తీసుకరావడం జరిగిందని పేర్కొన్నారు.  తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి ఇతర రాష్ట్రాలు మన సంక్షేమ పథకాలను కాపీకొట్టి అమలు చేస్తున్నారని  అన్నారు. వికారాబాద్‌ నియోజక వర్గంలో మొన్నటి సర్పంచ్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే అధికంగా గెలుపొందడం సంతోషకరమన్నారు. అదే విధంగా రాష్ట్రంలో 90శాతంకుపైగా టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందడం జరిగిందని పేర్కొన్నారు. ఇతర పార్టీలలో గెలుపొందిన సర్పంచ్‌లు కూడా భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరడం జరుగుతుందని పేర్కొన్నారు.

తాజావార్తలు