భవిష్యత్‌లో భూవివాదాలకు చెక్‌

భూ సర్వేపై సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా
రాజమండ్రి,ఆగస్ట్‌16(జనంసాక్షి): సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో ఆధునిక సాం కేతిక పరిజ్ఞానంతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్టు రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా అన్నారు. పైలెట్‌ గ్రామ సర్వేలో భాగంగా జరుగుతున్న సమగ్ర సర్వేను ఆమె పరిశీలించారు. భూవివా దాలకు చెక్‌ పెట్టేందుకు వైఎస్సార్‌ జగనన్న భూహక్కు భూరక్ష సమగ్రసర్వే పక్రియ దోహదపడుతుందన్నారు. భవిష్యత్‌లో భూవివాదాలకు ఆస్కారం లేకుండా ఈ సమగ్ర సర్వే భూముల పరిరక్షణ, సివిల్‌ తగాదాల నివారణ, భూమి అమ్మకం, కొనుగోలు పారదర్శకంగా నిర్వహించడం, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు, ప్రతీ అంగుళం భూమికి క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేందుకు పక్రియ అన్ని విధాలుగా దోహదపడుతుందన్నారు. ఈ పక్రియకు గ్రామస్థులు సహకారం అందించాలన్నారు. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ పక్రియ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్రౌండ్‌ ట్రూతింగ్‌, సరిహద్దు రాళ్లు ఏర్పాటు పక్రియ లను సబ్‌కలెక్టర్‌ పరిశీలించారు. సర్వేకు అవసరమైన డ్రోన్‌ కెమెరాలను కూడా రంగంలో దించినట్టు “