*** భారతీయులమని గర్విద్దాం…….

జాతి సమగ్రతను కాపాడుదాం……

* జనసంద్రమైన మానకొండూరు

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్

,** మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

కరీంనగర్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు జీ వి రామకృష్ణారావు

మానకొండూరు, ఆర్ సి, సెప్టెంబరు 16 (జనం సాక్షి)

1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలన దశకు పరివర్తన చెందిన రోజు, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజును పురస్కరించుకొని, రాష్ట్ర వ్యాప్తంగా 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల లో అంతర్భాగంగా మొదటిరోజు మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం 75వ వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సభావేదికపై ఈ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెరాస జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు లు చేసిన ప్రసంగం సభికులను ఉర్రూతలూగించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అందడానికి, విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ కల్పన తదితర అంశాలలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనిక పాలనలో దిక్సూచిగా నిలిచిందన్నారు. అంతకు ముందు నియోజకవర్గ కేంద్రమైన మానకొండూరు లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెరాస పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు లు పూలమాలవేసి ర్యాలీ ప్రారంభించారు. మానకొండూర్ లోని గడి మహల్, మార్కెట్, తూర్పు దర్వాజా మీదుగా ముంజంపల్లి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన సభాస్థలికి సుమారు 20 వేల మంది జాతీయ జెండాను చేత బూని జై బోలో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలివెళ్లారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రియాంక, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఎంపీపీ ముద్దసాని సులోచన, సర్పంచులు రోడ్డ పృథ్వీరాజ్, రామంచ గోపాల్ రెడ్డి, నియోజకవర్గంలోని ఆయా మండలాల సర్పంచులు ,ఎంపీపీలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభిమానులు, మద్దతుదారులు కార్యకర్తలు తదితరులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. వాహన, భోజన , మంచినీరు సభకు హాజరైన వారికి తదితర సదుపాయాలు కల్పించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా నాయకులు తగు ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జెడ్పిటీసి లు మాడ్గుల రవీందర్ రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, లింగాల నిర్మల- లక్ష్మణ్, ఇనుగొండ శైలజ, ఎంపిపిలు ఉమ్మెంతల సరోజన, కేతిరెడ్డి వనిత- దేవేందర్ రెడ్డి, వూట్కూరి వెంకట రమణారెడ్డి, కనగండ్ల కవిత గార్లు, నియోజకవర్గం లోని టీఆర్ఏస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు