భారత్ అమెరికా విశ్వ భాగస్వాములు: ఓబామా
-ఘనంగా గణతంత్ర వేడుకలు
-ఆకట్టుకున్న పెద్దన్న ఒబామా
-సత్తా చాటిన సైనిక విన్యాసాలు
-ఆకట్టుకున్న తెలంగాణ శకటం
ఘనంగా గణతంత్ర వేడుకలు
ఆకట్టుకున్న ఆత్మీయ అతిథి ఒబామా
న్యూఢిల్లీ,జనవరి26(జనంసాక్షి): దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో విశిష్ట అతిథిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా పాల్గొన్నారు.భారత్,అమెరికాలు విశ్వభాగస్వాములని ప్రపంచపెద్దన్న ఒబామా పేర్కోన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రత్యేక అతిథిగా రావడంతో ఈ వేడుకలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఏటా గణతంత్ర వేడుకలకు ఇతర దేశాల నుంచి అతిథులను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడినే అతిథిగా ఆహ్వానించి వేడుకలను జరుపుకోవడం విశేషం. ఒబామా రాక విశేషమో ఏమో అన్నట్లుగా చిరజల్లులు స్వాగతం పలికాయి. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హవిూద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తదితరులు హాజరయ్యారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా రాజ్‌పథ్‌కు చేరుకున ఒబామా ఈ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. ఒబామాకు ఉపరాష్ట్రపతి హవిూద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. చిరుజల్లుల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ వేడుకలకు ఏడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. నిఘా కోసం 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని మోడీ అమర జవాన్లకు నివాళులర్పించారు. పుష్పాంజలి ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. మరి కాసేపట్లో రాజ్‌పథ్‌కు అమెరికా అధ్యక్షుడు ఒబామా చేరుకోనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఒబామా దంపతలు వీక్షించనున్నారు.
ఆకట్టుకున్న త్రివిధ దళాల పరేడ్ గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించిన త్రివిధ దళాల పరేడ్ ఆకట్టుకుంది. సైన్యం, వాయుసేన, నావికాదళ బృందాల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర కవాతు మహిళా సాధికారతను చాటింది.66వ గణతంత్ర వేడుకలు దిల్లీలోని రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన త్రివిధ దళాల పరేడ్ ఆకట్టుకుంది. సైన్యం, వాయుసేన, నావికాదళ బృందాల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర కవాతు మహిళా సాధికారతను చాటింది. ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా వివిధ రాషాలె శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.తెలంగాణ శకటంప్రత్యేకంగా ఆకట్టుకుంది.సంక్రాంతి ఇతివృత్తంగా ప్రదర్శించిన ఆంధప్రదేశ్ శకటం, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాలు ఇతివృత్తంగా సాగిన తెలంగాణ శకటం ఆకుట్టుకున్నాయి. వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజ్‌పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా రాష్టాల్రు శకటాలను ప్రదర్శించాయి. తెలంగాణ శకటం అందరినీ ఆకర్షించింది. బోనాల ఇతివృత్తంతో తెలంగాణ శకటం ముందుకు సాగింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా శకటాన్ని ప్రదర్శించారు. పోతు రాజుల విన్యాసాలు, బోనాలు ఆకట్టుకున్నాయి. శకటంపై జమ్మి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ శకటాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. ఢిల్లీలోని తెలంగాణవాసులు తెలంగాణ శకటాన్ని చూసి చప్పట్లతో స్వాగతం పలికారు. ఇక ఇద్దరు వీర జవాన్లకు అశోక చక్ర పురస్కారాలను జవాన్ల కుటుంబసభ్యులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందచేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మేజర్ ముకుంద్ వరదరాజన్, నీరజ్ కుమార్ సింగ్ అమరులైన సంగతి తెలిసిందే.
గణతంత్ర వేడుకల్లో తెలుగు విద్యార్థులు
దేశ రాజధానిలో 66వ గణతంత్రదిన వేడుకల్లో తెలుగు రాష్టాల్రకు చెందిన 16 మంది ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. గతంలో ఉమ్మడి ఆంధప్రదేశ్ ఎన్‌ఎస్‌ఎస్ హైదరాబాద్ రీజియన్‌లో ఉండేది. ప్రస్తుతం అదే విధానం కొనసాగిస్తూ ఆంధప్రదేశ్, తెలంగాణల నుంచి 16 మంది విద్యార్థులు పరేడ్‌లో పాల్గొంటున్నారు. కంటింజెంట్ లీడర్ సౌజన్య పర్యవేక్షణలో కొన్ని రోజుల నుంచి విద్యార్థులు స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో పరేడ్ రిహార్సల్స్ చేస్తున్నారు. ప్రపంచస్థాయి భాగస్వామ్యం: ఒబామా
న్యూ ఢిల్లీ, జనవరి 26: ఇరు దేశాల వాణిజ్యంలో 60 శాతం వృద్ధి సాధించామని, వాణిజ్యం, పెట్టుబడుల్లో మరింత వృద్ధి సాధించాలని కోరుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సీఈఓల సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా సహా దేశానికి చెందిన 17 అగ్ర వ్యాపార సంస్థల సీఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒబామా ప్రసంగిస్తూ.. మనది ప్రపంచ స్థాయి భాగస్వామ్యం అని అన్నారు. పారిశ్రామికవేత్తలతో తన ఆలోచనలు పంచుకోవడం సంతోషకరంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల సంబంధాలు కొత్త ప్రపంచానికి మార్గదర్శకమవుతాయని, ఇరు దేశాల గమనం సరైన మార్గంలో వెళుతోందని చెప్పారు. వినియోగించుకోవాల్సిన వనరులు ఎన్నో వున్నాయని, వ్యూహాత్మక వాణిజ్య చర్చలతో పురోగతి సాధ్యమన్నారు.ఇంజనీరింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని, భారత్‌లో అద్భుతమైన వ్యాపార నైపుణ్యం ఉందని ఒబామా వ్యాఖ్యానించారు. అమెరికాలో భారత్ పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. అమెరికా దిగుమతుల్లో భారత్ వాటా 2 శాతమే ఉందని, వాటిని పెంచుతామని అన్నారు. అమెరికాలో వాణిజ్య నిబంధలను హేతుబద్దీకరిస్తామని ఒబామా ప్రకటించారు. భారత్‌కు కొత్త రైల్వే లైన్లు, రైళ్లు అవసరమని చెప్పారు. భారత బ్యాంకు ఖాతాలు డిజిటలైజ్ చేసేందుకు అమెరికా సాయం చేస్తుందని ఆయన ప్రకటించారు. దేశాభివృద్ధికి జీడీపీలు కొలమానం కాదని, ఇరు దేశాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధించాలన్నారు. ప్రజల జీవితాల్లో వచ్చే మార్పే అభివృద్ధికి సూచిక అని ఒబామా చెప్పారు.
భారత్-అమెరికా బంధాలు పెరుగుతున్నాయి : మోదీ
న్యూ డిల్లీ, జనవరి 26: అన్ని సమస్యలకు పరిష్కారం సుపరిపాలనేనని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన భారత్-అమెరికా సీఈవోల సదస్సులో ప్రధాని మోదీ, ఒబామా, దేశానికి చెందిన 17 అగ్రగామి వ్యాపార సంస్థల సీఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ ఆర్ధిక వృద్ధికి మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. భారత్-అమెరికా ప్రాజెక్టులను పీఎంవో చూస్తుందన్నారు. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు బలపడుతున్నాయని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లో అమెరికా పెట్టుబడులు 50 శాతం పెరిగాయని చెప్పారు. ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్టస్థాయికి పడిపోయిందని మోదీ వివరించారు.
భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని మోదీ పేర్కొన్నారు. అధిక పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని ప్రాజెక్టులపై పీఎంఓ నిఘా ఉంటుందని ఆయన తెలిపారు. భారత్‌లో అద్భుతమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని మోదీ అన్నారు.అమెరికాతో ఆర్థిక సంబంధాలు సరైన దిశలోనే వెళుతున్నాయని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గంగా ప్రక్షాళనకు చిత్త శుద్ధితో పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశంలోని అన్ని సమస్యలకు ప్రజానుకూలమైన సుపరిపాలనే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. నా అమెరికా పర్యటన తర్వాత భారత్‌తో పెట్టుబడులు పెరిగాయని ఆయన వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని… భారత్-అమెరికాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నరేంద్రమోదీ తెలిపారు.