భారత్‌ సాయంతో లంకలో స్టేడియం

1

– ఢిల్లీ నుంచి ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ,జూన్‌ 18(జనంసాక్షి): శ్రీలంకలో పునర్మించిన దురైయప్ప మైదానాన్ని శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని న్యూఢిల్లీ నుంచి దీనిని ప్రారంబించారు. దీనికి భారత్‌ ఆర్థిక సాయం అందించింది. భారత్‌ సాయంతో శ్రీ లంకలోని జాఫ్నాలో దురైయప్ప మైదానాన్ని పునర్‌నిర్మించారు. మైత్రిపాల సిరిసేన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనగా, దిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు జాఫ్నా స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకల్లో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్టేడియంలో యోగా చేశారు.  జఫ్నా మాజీ మేయర్‌ ఆల్‌ఫ్రెడ్‌ తంబిరాజా దురయప్ప పేరుతో భారత్‌  ఈ స్టేడియాన్ని రూ.7కోట్లతో పునరుద్ధరించింది. అనంతరం మైదానాన్ని జాతికి అంకితం ఇచ్చారు.  దురైయప్ప మైదానం పునర్నిర్మాణానికి సాయం చేసిన భారత్‌కు ఈ సందర్భంగా మైత్రిపాల సిరిసేన కృతజ్ఞతలు తెలిపారు. కాగా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ మాట్లాడుతూ భారత్‌ ఆర్థిక వృద్ది పొరుగు దేశాలకు లాభదాయకం కావాలన్నారు. శ్రీలంక ఆర్థికంగా మరింత సంపన్నంగా కావాలని భారత్‌ కోరుకుంటుందని మోదీ ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పరిమితం కాదని అన్నారు.