భారత స్వాతంత్ర్యోద్యమంలో మహాత్మా గాంధీ సేవలు మరువలేనివి;మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ టౌన్ అక్టోబర్ 02 ( జనంసాక్షి )
ఆదివారం మన జాతిపిత,భారతదేశపు స్వాతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీ  పుట్టిన రోజుని పురస్కరించుకొని కోదాడ పురపాలక సంఘం పరిది లోని గాంధీ పార్క్ లో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి  మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ  నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా జీవితమే నా సందేశం అని చాటిన మహనీయుడు గాంధీజీ. అహింసాయుత మార్గంలోనే ఆయన సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ప్రపంచానికి ఆయన అందించిన పదునైన ఆయుధం అది. మహాత్మా గాంధీ అందించిన అహింసా ఉద్యమం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచింది. ఆయన ఎంచుకున్న బాట ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఓ పాఠ్యాంశంగా మారింది. గాంధీ జీవితం,ఆయన నమ్మిన సిద్ధాంతాలు, నడిపిన ఉద్యమాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని కొనియాడారు.ఈ కార్యక్రమం లో వీరితో పాటు వార్డ్ కౌన్సిలర్స్ పేండెం వెంకటేశ్వర్లు,గుండపునేని పద్మ నాగేశ్వరరావు, తిపిరిశెట్టి సుశీల రాజు,మీసా సత్యనారయణ, మునిసిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు
Attachments area