భారత స్వాతంత్ర వజ్రోత్సవ ర్యాలీ నిర్వహించిన గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ సిబ్బంది
జనం సాక్షి, చెన్నరావు పేట
భారత స్వాతంత్ర వజ్రోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని ఎం.పీ.డీ.వో దయాకర్ ఆధ్వర్యంలో గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ సిబ్బంది చెన్నారావుపేట కార్యాలయం నుండి నూతన కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుండే మల్లయ్య, ఎం.పీ.డీ.వో దయాకర్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్ మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవ వేల మహిళా సంఘాల సభ్యులు ఉత్సవాలలో పాలుపంచుకోవాలని ప్రతి ఒక్కరూ భాగస్వాములై దేశభక్తిని చాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు భాగ్య ,గ్రామ సంఘ అధ్యక్షులు, సీసీలు కట్టయ్య వెంకటేశ్వర్లు సుజాత మంజుల వివోఏలు సుధా, మంజుల, ఆమని, కుమారస్వామి, రమేషు, శ్యాము, శరత్ బాబు, శ్రీనిధి మేనేజర్ సరిత, వివిధ గ్రామాల వి. ఎల్ .ఈ లు, రజిత, ఉమ తదితరులు పాల్గొన్నారు.