భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భగా క్రీడా పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, కుడుములు సత్యం

ఎల్లారెడ్డి ఆగస్టు 13  (జనంసాక్షి ) భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఎల్లారెడ్డి మండలంలోని గండి మాసానిపేట జెడ్ పి హెచ్ ఎస్ లో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలను శనివారం స్థానిక మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎంపీపీ కర్రే మాధవి బాల్రాజ్ గౌడ్ ప్రారంభించారు. ముందుగా వారు మండలంలోని ఆయా గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాలు అని కొనియాడారు. బ్రిటిష్ వారిని ఎదిరించి ఎందరో మహనీయులు అమరవీరులు అయ్యారని, వారి ప్రాణాల త్యాగ ఫలితమే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న భారత స్వాతంత్రం అని వారన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో పాల్గొనే అవకాశం దక్కడం మనందరి అదృష్టం అని వారన్నారు. భారతీయులుగా భారత దేశంలో జన్మించినందుకు ప్రతి ఒక్కరు గర్వించాల్సిన విషయం అన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని చాటుతూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. అంతేగాక క్రీడల్లో గెలుపోటములు అనేవి సహజమని ఎవరు కూడా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించకూడదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముత్యాల సుజాత, ఎంపీడీవో మల్లికార్జున్ రెడ్డి, ఎంపీ ఓ ప్రకాష్, స్థానిక ఎస్సై గణేష్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు స్వప్న, మల్లిక,  కౌన్సిలర్లు అల్లం శ్రీను, ఎంపిటిసి సంతోష్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు ఎల్లయ్య, అంజయ్య, మల్లేష్ రాజు, తదితరులు పాల్గొన్నారు.