భారీ ఎత్తున గంజాయి, బంగారు బిస్కట్లు స్వాదీనం
వరంగల్: పదిన్నర కిలోల గంజాయి, పన్నెండున్నర తులాల బంగారు బిస్కట్లు స్వాదీనం చేసుకుని ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కిశోర్‌కుమార్ తెలిపారు. ఆత్మకూరు మండలం నీరుకుల్ల క్రాస్ రోడ్ వద్ద ఎస్‌ఐ క్రాంతి కుమార్ వాహనాల తనిఖీ చేస్తుండగా కారులో ఇద్దరు వ్యక్తుల వద్ద వీటిని స్వాదీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కనకయ్య, లక్ష్మీప్రసన్న అనే ఇద్దరు వ్యక్తులు వీటిని బెంగళూర్ తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.