భీమేశ్వర సభామండపం
భీమేశ్వరాలయం మా వూరికి ఓ మూలకి వుంటుంది. ఈ గుడితో మా వూరి వాళ్లకి విడదీయరాని అనుబంధం. దానికి కా రణాలు అనేకం. ఈ గుడి విశాలమైన ప్రదేశంలో వుంటుంది. గుడి చుట్టూ పెద్ద తోట వుంటుంది. ఆ తోటలో రకరకాలైన పూలచెట్లు వున్నాయి. రాజేశ్వరునికి, రాజేశ్వరీదేవికి ఇక్కడినుంచే పూలు వెళ్తుంటాయి. పూలచెట్లే కాదు జామ చెట్లూ ఈ తోటలో వున్నాయి. చాలా తక్కువగా కన్పించే రామసీతాఫలచెట్లు కూడా వుండేది. పూల చెట్లు, పండ్లచెట్లేకాదు ఈ తోటలో రెండు నాగుంపాము పుట్టలు కూడా వున్నాయి. నాగుల చవితిరోజు మా వూరి వాళ్లంతా వచ్చి ఇక్కడవున్న పట్టల్లో పాలు పోస్తారు. పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో వనభోజనానికి వస్తారు. రాజన్న గుడికి భిన్నంగా ఈ గుడి ప్రశాంతంగా వుంటుంది.ఈ గుడి ప్రాంగణంలో ఆంజనేయ స్వామి గుడి వుంది. దానిముందు పెద్ద రావిచెట్టు. ఆ చెట్టుమీద తల కిందులు చేసి తపస్సు చేస్తున్న మనుల్లా గబ్బిలాలు, దాన్ని ఆను కొని ఒక పెద్ద స్టేజి. దాని ముందు వెయ్యిమందిదాకా కూర్చో వడానికి స్థలం.భీమేశ్వరాలయం చాలా ప్రశాంతంగా వుంటుంది. లింగం చాలా పెద్దగా వుంటుంది. పది అడుగుల ఎత్తు వుంటుంది. జనం చాలా పలుచగా ఇక్కడికి వస్తారు. రాజన్న గుడితో పోలిస్తే ఇక్కడ జనం కన్పించరు. సందడి వుండదు. అధికారులూ తక్కువే. ఒకే ఒక్క పూజారి వుంటాడు. అందుకని మా చిన్నప్పుడు గుడిలో నికి వెళ్లాలంటే చాలా భయంగా వుండేది. గుడిచుట్టూ తిరిగేవాళ్లం కానీ గుడిలోకి వెళ్లేవాళ్లం కాదు.
మా గుడి తోటమాలి పోచెట్టి లేనప్పుడు, నిద్రపోతున్నప్పుడు తోట లోకి వెళ్లి జామకాయలు తెంపుకునేవాళ్లం. ఆ శబ్దాన్ని పాములా పసిగట్టేవాడు పోచెట్టి. కట్టె పట్టుకొని పరుగెత్తుకొచ్చేవాడు. అతనికి దొరకకుండా మేం పారిపోయేవాళ్లం. ఇది అతనికి మాకూ మధ్య నడిచిన ఆట.భీమేశ్వరుని వరప్రసాదం భీమకవి అని కథలు చెప్పే వాళ్లు. భీమకవి మా వూరి వాడేనని భీమేశ్వరస్వామి వరపుత్రుడని ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. రెండో అరికేసరి మహారాజు ఆస్థానకవి పంపడు. అతిని సోదరుడు చిన్నవల్లభుడు. అతను కురిక్యాల గుండ శిలాశాసనం వేయించాడు. అది కన్నడ సంస్కృ తాంధ్ర భాషలలో వుంది. చిన్నవల్లభుని ప్రోత్సాహంతో కవిజనా శ్రయ గ్రంథాన్ని రేచన రచించాడు. తరువాతి కాలంలో మల్లయ్య రేచన రాసిన కవి జనాశ్రయం వేములవాడ భీమకవి పేరుతో ప్రసిద్ధి పొందింది. ఇంతేకాదు భవిష్యపురాణం, కవిజనాశ్రయ గ్రంథాల ప్రకారం భీమకవి జన్మస్థలం మా వేములవాడే. అతని సృష్టికర్త భీమే శ్వరుడే. ఇన్ని ఆధారాలు వున్నా భీమకవి ద్రాక్షారామం వాడని ఆ ప్రాంతం వాళ్లు అంటూ వుంటారు. భీమకవి నివసించిన ప్రాంతం భీమేశ్వరాలయం, ఆ పరిసర ప్రాంతాలు. ఓ కవి నివసించిన ప్రాం తం కాబట్టి ఈ ప్రాంతమంతా ఆ తరువాతికాలంలో కూడా కవి త్వంతో ప్రతిధ్వనించింది.భీమకవి ప్రస్తావన వచ్చినప్పుడు అప్పాలన్నీ కప్పలు కావాలే, అన్నమంతా సున్నం గావాలేనన్న అతని మాటలు గుర్తొస్తాయి. ఓసారి అతను భోజనం చేద్దామని ప్రయత్నం చేస్తే మిగతా వ్యక్తులు అతను భోజనం చెయ్యడాన్ని నిరాకరించారు. అప్పుడు భీమకవి అప్పాలన్నీ కప్పలు గావాలే, అన్నమంతా సున్నం కావాలె అన్నాడని, అవి అట్లాగే అయినాయని చెబుతారు. వశ్య వాక్కు వున్న కవిగా భీమకవి ప్రసిద్ధుడు. అప్పాల ఇంటిపేరుతో మా వూర్లో చాలామంది బ్రహ్మలు వున్నారు. శాసనాలు చూసినా వాడు కలో వున్న కథలు విన్నా భీమకవి ఇక్కడి వాడేనని, భీమేశ్వరుడంటే వేములవాడ భీమేశ్వరుడేనని స్పష్టమవుతుంది. ఈ విషయం చెప్పడం కోసం కాదు ఈ కథ.
భీమన్న గుడి ముందు దేవస్థానం వాళ్లది ఓ పాత బిల్డింగు వుంది. అందులో మా బడి వుండేది. మా వూరిలో బడి నిర్మాణం కాముందు మా బడి ఈ పాత బిల్డింగులో వుండేది. నేడు ఏడవ తరగతిలో వుండగా మా బడిని కొత్త బిల్డింగులోకి మార్చినారు. మా బడి ఇక్కడ వున్నప్పుడు రోజూ భీమన్న గుడిలో వున్న ఏనుగు విగ్ర హాల మీద కూర్చునేవాళ్లం. గుడిలో ఆటలు ఆడేవాళ్లం.మా వూరి బ్రాహ్మలు తమ పిల్లలకి మంత్రాలూ వేదాలూ ఇక్కడి భీమన్న గుడి లోనే నేర్పేవాళ్లు. రోజూ ఉదయం ఆ దృశ్యం గుడిలో కన్పించేది. ఆ మంత్రోచ్చరణలో ఏదో ప్రకంపన కన్పించేది. అది ప్రకంపనే అయి నా హృదయాన్ని కదిలించేది. మనస్సుని ఎక్కడికో తీసుకెళ్లేది. మా బడి గంట కొట్టిన శబ్దం విన్పించకపొయ్యేది. మా బ్రాహ్మలే బడి గంట కొట్టిన సంగతి గుర్తుచేసేవాళ్లు.ప్రతి జనవరిలో సంక్రాంతి ముందు త్యాగరాయ ఉత్సవాలు మా వూరిలో జరుగుతాయి. అవి ఎక్కువగా మా భీమన్న గుడిలో ఆవరణలో జరిగేవి. భీమన్న గుడి ప్రాంగణంలోనే పుస్తకావిష్కరణ సభలు జరిగేవి. నేను తొమ్మిదో తర గతి చదువుతున్నప్పుడు ఒకేరోజు మూడు పుస్తకావిష్కరణ సభలు జరిగాయి. ఆ పుస్తకాల గురించి మాట్లాడిన మాటలు వినడం గొప్ప అనుభూతి. కవితా గానాలు కవిత్వ పఠనాలు జరిగేవి. ఏ సభ జరి గినా వంద రెండు వందల మంది దాక హాజరయ్యేవాళ్లు. సాయంత్రాలు జరిగిన సభలకి మఫర్లు, స్వెటర్లు వేసుకుని వచ్చే వాళ్లు. హరికథలు బుర్రకథలకే కాదు, సంగీత కార్యక్రమాలకి, కవి సమ్మేళనాలకు జనాలు వచ్చేవాళ్లు. ఉత్సా హంగా పాల్గొనే వాళ్లు. జనవరి నెలకోసం ఎదురుచూసేవాళ్లు.కొంతకాలానికిమా వూ రికి చివర్లో బడి కట్టారు. మేమందరం అక్కడికి వెళ్లిపోయాం. భీమన్న గుడితో కొంత దూరం పెరిగి పోయింది. జనవరిలో మాత్రం తప్పక వచ్చేవాళ్లం. ఏదైనా కవి సమ్మేళనం జరిగినా వచ్చేవాళ్లం. మా బడి వున్న బిల్డిం గులో ఒక పెద్ద హాలుని కట్టారు. దానిమీద కూడా మరో పెద్దహాలు కట్టారు. ఆ రెండు హాళ్లు, మా బడి వున్న బిల్డింగు పెళ్లిళ్లకి కిరాయికు ఇచ్చేవాళ్లు. భీమేశ్వరాలయం గుడి సందు లో సాహితీ మిత్రుల సమావేశాలు చొప్పకట్ల చంద్రమౌళి ఇంట్లో జరిగేవి.మేం గ్రాడ్యుయేషన్‌కి వచ్చేసరికి మా వూర్లో కళా భారతి అన్న సంస్థని ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు కవితా గోష్టులు కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసేవాళ్లు. భీమకవి సంచరి ంచిన ప్రదేశంలో కవితా గోష్టులు జరగడం యాదృచ్ఛికమే అయినా ఆయన ప్రభావం తెలియకుండానే ఆ ప్రాంతం మీద వుందేమో నన్నట్టుగా కొంతకాలానికి మేమూ కళానికేతన్ అన్న సంస్థని ఏర్పా టు చేశాం. మా మొదటి కవి సమ్మేళనం మూడు గంటలు జరిగిం ది. ఓ నలభైమంది కవులు కవిత్వం చదివారు. ఒక్క మా వేముల వాడలోని కవులే కాదు చుట్టుపక్కల వున్న కవులు ఎంతోమంది వచ్చారు. తమ కవిత్వాలు విన్పించారు. ఆ తరువాత మూడు నాలు గు సంవత్సరాల పాటు ఈ రెండు సంస్థలు నిర్విరామంగా పని చేశా యి. మా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు మరీ ఎక్కువ. ప్రతి నెలకి ఒకసారి కవి సమ్మేళనం జరిగేది. మూడు నెలలకొకసారి పెద్ద కార్యక్రమాలు జరిగేవి. జనంకోసం సభ ఎన్నడూ ఆలస్యంగా జర గలేదు. అనుకున్న సమయానికే సభ జరిగేది. జనాలు పెద్దసంఖ్యలో వచ్చేవాళ్లు. ఈ హాలుకి మేం పెట్టిన పేరు భీమేశ్వర సభామంటపం. ఆ హాలుకి ఆ పేరు చాలాకాలం వాడుకలో వుంది.మా వూరిలో సాంబశివశర్మ అని ఓ కవి వుండేవాడు. మా రాజేశ్వరుని సుప్రభా తం అతనే రాశాడు. కవిత్వం తప్ప అతనికి మరేమి రాదు. అందు కని దేవస్థానం వాళ్లు అతనికి రోజుకి ఒక పూట ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. అతను మా కవి సమ్మేళనానికి స్టార్ అట్రాక్షన్. ప్రధాన ఆకర్షణ. అతను దరిద్రంతో ఎక్కువ బాధపడ్డాడు కాబట్టి లోభసంహారం అన్న కావ్యం రాశాడు. ఇంకా చాలా రాసినప్పటికీ లోభసంహారం పద్యాలు వినడం ఓ గొప్ప అనుభూతిగా వుండేది. ఆయన గొంతూ శ్రావ్యంగా వుండేది. ప్రతి కవి సమ్మేళనంలో అత ను వేరే పద్యాలు చదివినా లోభసంహారం పద్యాలు చదవాల్సిందే. మా వూరికి వచ్చిన కవులూ, సాహితీవేత్తలు ఆయన పద్యాలు విని చప్పట్లు కొట్టాల్సిందే. అతని భుక్తికి లోటు రావద్దని ఆయన ఇంటిని తీసివేసి రెండు షాపులు ా, రెండు రూములు మా సంస్థ ద్వారా మా వూరి వాళ్లందరి దగ్గర చందాలు వసూలు చేసి కట్టించాం. దాని తర్వాత అతని జీవితకాలమంతా భుక్తికి లోటు రాలేదు. సాహిత్యం నేర్పిన సంస్కారం అది.కవిత్వం గురించిన సమావేశాలు, కథల గురించి సమావేశాలు ఒక్కటేమిటీ ఎన్నో జరిగాయి ఆ భీమేశ్వర సభా మంట పంలో. కవిత్వ చర్చలు, మినీ కవితా ప్రదర్శనలు, వా దోపవాదాలు, చిత్రకళా ప్రదర్శనలు, లిఖిత మాసపత్రిక ఆవిష్కరణ, సావనీర్‌ల ఆవిష్కరణలు ఇట్లా ఎన్నో.
ఆ తరువాత మా యూనివర్సిటీ ప్రయాణం. ఆరు నెలలకి ఒకమారు కార్యక్రమాలు వుండేవి. అప్పుడప్పుడే టీవీలు రంగప్రవేశం చేస్తున్న సమయం అది. మా హాస్టల్లోని కామన్ రూంలో టీవీ వుండేది. దాని చుట్టూ మా ఫ్రెండ్స్ వుండేవాళ్లు. మా వూరిలో కూడా అప్పుడప్పుడే టీవీలు వచ్చాయి. చాలా ఇండ్లమీద ఓ స్తంభం లాంటి ఇనుప పైపు. దానిమీద 12 చిన్న పైపులతో ఆంటె న్నా వచ్చేశాయి. బ్లాక్ అండ్ వైట్‌ల నుంచి రంగుల టీవీలు వచ్చా యి. పందుల పెంపకాల కార్యక్రమాల నుంచి మహాభారతాలు వచ్చే శాయి. అక్కడక్కడా కాలక్రమంలో కన్పించకుండా పోయినాయి. డిష్‌లు వచ్చేశాయి. రెండు ఛానళ్లు మాత్రమే వచ్చే మా వేరి టీవీ ఇప్పుడు వంద ఛానళ్ల టీవీలుగా మారిపోయాయి.మా భీమేశ్వర సభామంటపమూ మారిపోయింది. దాని రూపురేఖలు మార్చివేసి నారు. కొద్ది రోజులు యాత్రికులకోసం గెస్ట్‌హౌస్‌గా మార్చినారు. ఆ తరువాత కొంతకాలానికి దాన్ని హాస్పిటల్‌గా మార్చినారు. సరైన వైద్యం చేసే నాధుడు లేడు. పేషంట్లు లేరు. కాని హాస్పిటల్ మాత్రం వుంది. ఇప్పుడక్కడ భీమేశ్వర సభామంటపం లేదు.
భీమకవి సంచరించిన మా వూర్లో ఇప్పుడు కవి సమ్మే ళనాలు లేవు. సాహిత్య కార్యక్రమాలు లేవు. త్యాగరాజు ఉత్సవాలు కూడా మొక్కుబడిగా సాగుతున్నాయి. భీమన్న గుడి ఉంది, భీమేశ్వర సభామంటపం లేదు. ఏదైనా సాహి త్య కార్యక్రమం పెడదామంటే భీమన్నగుడి ముందు భీమే శ్వర సభామంటపం లేదు.కవిత్వం వున్నా, కథలు వున్నా వినే నాధుడు లేడు. స్థలం సంగతి దేవుడెరుగు. ఇప్పుడంతా టీవీల్లో పరకాయ ప్రవేశం. ఏదో ఆడవిలన్ చుట్టో, ఏ సీరి యల్లోనో జనాల పరకాయప్రవేశం. భీమేశ్వర సభామంట పం, కవి సమ్మేళనాలు, మామిడిపల్లి సాంబశివవర్మ, మేం చేసిన కార్యక్రమాలు, నవత లిఖిత పత్రిక ఇవన్నీ జ్ఞాప కాలు.అయినా మా వూరికి వెళ్లినప్పుడల్లా భీమన్న గుడికి వెళ్తాను. ఆ ప్రాంతంలో సంచరిస్తాను. ఓ భావ సంచ లనానికి లోనవుతాను. నా జ్ఞాపకాలని వెతుక్కుంటాను. నా కవిత్వమూ విన్పిస్తాను. నా కథనూ చదువుతాను – కన్పిం చే భీమేశ్వరుని లింగానికి, కన్పించే భీమేశ్వరుని లింగానికి, కన్పించని భీమకవికి.
భీమకవి తిరిగిన ప్రాంతం కాదా! కాలం మార కపోతుందా? మళ్లీ భీమేశ్వర సభామంటపంలో కవిత్వం చదవకపోతానా? మీరందరూ వినకుండా పోతారా?