భుల్లార్‌కు శిక్ష తగ్గించండి

ప్రధానికి పంజాబ్‌ సీఎం వినతి
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి):
ఢిల్లీలో 1993లో జరిగిన కారుబాంబు పేలుడు నిందితుడు, ఖలిస్థాన్‌ తీవ్రవాది దేవిందర్‌పాల్‌ సింగ్‌ భుల్లార్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ప్రధాని మన్మోహన్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారంనాడు ఆయన ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌తో కలిసి ప్రధానిని కలిశారు. బుల్లార్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని ప్రధానికి వినతి పత్రం సమర్పిం చినట్టు ఆయనతో భేటీ అనంతరం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ చెప్పారు. భుల్లార్‌ క్షమాభిక్ష పిటీషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే. భుల్లార్‌ను ఉరితీస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, అందువల్ల అతని మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్పుచేయాలని ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌   వెనిజుల అధ్యక్షుడిగా హ్యూగో చావేజ్‌ అనుచరుడు నికోలస్‌ మ్యాడురో ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ఎన్నికల సంఘం సోమవారం అధికారికంగా ప్రకటించింది. దివంగత అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనుసరించిన సోషలిస్టు విధానాలనే కొనసాగించేందుకు మ్యాడురోకు ప్రజలు పట్టం కట్టారు. ఆదివారం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మ్యాడురో 50.7శాతం ఓట్లుతో విజయం సాధించారని  కోరారు. అంతకుముందు సిక్కుల అత్యున్నత సంస్థ అఖల్‌తక్త్‌ కూడా భుల్లార్‌ మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని విజ్ఞప్తి చేసింది. భుల్లార్‌కు విధించిన మరణశిక్ష అమలులో జాప్యమవుతున్నందున ఆ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని అతని తరఫున కుటుంబసభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్‌ నుంచి పెండింగ్‌లో ఉంచింది. ఎట్టకేలకు దీనిపై గత నెలలో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరిస్తూ జాప్యం కారణంగా శిక్షను మార్చలేమని స్పష్టం చేసింది. తీవ్రవాద దాడిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, దానికి బాధ్యుడైన వ్యక్తికి శిక్షను తగ్గించాలనడం సమంజసం కాదని కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.