భూపాలపల్లి కేటీకే 1వ గనిలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి.
వరంగల్ కోల్‌బెల్టు: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గనిలో సోమవారం మొదటి షిప్టులో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. గనిలోని 1వ సీమ్, 1వ డీమ్, 36 లెవల్ లో ఇద్దరు జనరల్ మజ్‌దూర్‌లో ప్రభాకర్, గణపతి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో హాలర్‌కు సంబంధించిన రోమ్ కాళ్లకు తగలడంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తోటి కార్మికులు క్షతగాత్రులను సింగరేణి ఆసుపత్రికి తరలించారు.