భూములు లేకున్నా ఫించన్ కట్

బిజినేపల్లి జనం సాక్షి. అక్టోబర్.14:- ప్రభుత్వ నిబంధనల మేరకు భూమి, వాహానాలు, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి లేకున్నా పింఛన్ కట్ కావడంతో ఫించన్ దారులు లబో దిబోమంటున్నారు. మండలంలోని సల్కేరపేట గ్రామానికి చెందిన ఫించన్లు కట్ అయిన బాధితులు శుక్రవారం  ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే నిజమైన లబ్దిదారులకు లబ్ధి చేకూర కుండా ఫించన్లు కట్ చేశారని ఎంపీటీస సభ్యుడు ఆంజనేయులు ఆరోపించారు. అనర్హులకు ఫించన్లు మంజూరు ఇచ్చి అర్హులను తొలగించడంలోని అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోని ఫించన్ తొలగించిన నిజమైన లబ్ధిదారులకు వెంటనే ఫించన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కృష్ణయ్యకు బాధిత ఫించన్ దారులతో కలసి కోరారు. ఆయన వెంట గ్రామస్తులు రాములు, శ్రీశైలం రెడ్డి, గ్రామ యువకులు  ఉన్నారు.