భూసేకరణ చట్టం, దానిలోని ముఖ్యాంశాలు

(శనివారం తరువాయి భాగం) పారిశ్రామికీకరణ ఒక్కటే మన దేశంలో అధిక ఉత్పత్తులు సాధ్యం చెయ్యగలదనీ, మన దేశం ఒక ఆర్ధిక శక్తిగా ఎదగడానికి మనకున్న ఒకే ఒక మార్గం అదేనని, మరొక ప్రత్యామ్నాయ మార్గం లేదనీ(ఇదే మనలాంటి దేశాలకు అప్పులు ఇచ్చే ప్రపంచ బ్యాంక్‌ నిర్థారించిన మార్గం కూడా) ఒక గట్టి నమ్మకం మన నేతృత్వానికి ఉంది. అందుచేత అభివృద్ది అనే భావనని వెనుకకు నెట్టివేసి వృద్ది అనే దానిని ముందుకు తీసుకుని వచ్చాయి. పారిశ్రామికీకరణ, మౌళిక వసతుల సదుపాయాలు, పట్టణీకరణ మన వృద్దికి కావలసిన మూడు మంత్రాలయ్యాయి. ఈ నవీన భారతం గురిం చిన కల నిజం కావాలంటే బలవంతంగానైనా సరే, భూసేకరణ కార్యక్రమం కొనసాగించడం, దానితోపాటే వచ్చే నిర్వాసిత కుటుంబాల సమస్యలకి ఒక సంతృప్తికరమైన సమాదానం చూపిం చడం అత్యవసరమయ్యాయి. మొదటి దశలో ఈ నిర్వాసిత ప్రజల సమస్యలు తప్పించుకోలేని సాంఘీక సమస్గఆ చూడడంతో, దేశ మంతటకి ఉపయోగపడే ఒకే ఆర్‌&ఆర్‌ పాలసీ తయారు చేయ్య కుండా , ఏ రాష్ట్రానికా రాష్ట్రం తనకనువైన పథకాలను రూపొందిం చుకునే బాధ్యతనీ, అధికారాన్ని రాష్ట్రాకే ఇచ్చేసారు. కొంతకాలం త రువాత రెండవ దశలో నోయిడా రైతు ఉద్యమాలు దానిలో కాంగ్రెస్‌ పార్టీ కలుగజేసుకోవడం ఒక పక్క, పారిశ్రామికీకరణకి అవసరమైన ఖనిజ సంపద అధికంగా ఉన్న వెనుకబడిన రాష్ట్రలలో మావోయి స్టు ప్రభావంతో వస్తున్న అభివృద్ది వ్యతిరేక ఉదమాల కారణంగా నిర్వాసిత ప్రజల సమస్య రాజకీయ సమస్యగా మారడం జరిగింది. ఈ సందర్బాంలో పెట్టుబడులు నిరంతరాయంగా దేశంలో అన్ని చోట్ల ప్రవహించాలంటే అత్యంత అత్యం వేగంగా నిర్వాసితుల సమ స్యకి ఒక సంతృప్తికరమైన సమాధానం కావలసి వచ్చింది. కొత్త భూ సేకరణ బిల్లు 2011 తయారైంది.
ఈ బిల్లు పేరు లాండ్‌ అక్విసిషన్‌, రిహాబిలిటేషన అండ్‌ రీసెటి ల్మెంట్‌ బిల్‌ 2011 (ఎల్‌ఎఆర్‌ఆర్‌ బిల్‌ 2011) దేశమంతటా జ మ్మూకాశ్మీర్‌ను మినహాయించి, వర్తింవబడే ఈ బిల్లులో రెండు ము ఖ్య ఉద్దేశాలు మనం గమనించవచ్చును.
మొదటిది, దేశంలో అడ్డంకులు లేకుండా పెట్టుబడి ప్రవేశం, రెండవది దీనివలన తోసివేయబడే ప్రభావిత (నిర్వాసిత) ప్రజల సంక్షేమం మొదటి ఉద్దేశ్య సాఫల్యం కోసం భూసేకరణ సక్రమంగా కట్టుదిట్టంగా జిరిగేటట్లుగా బిల్లును రూపొందించడం, రెండవ దాని కోసం నిర్వాసితప్రజల ఆశలు, సంస్కృతి, కమ్యూనిటీ, ప్రకృతి వన రులు, వారి నైపుణ్యత ఆధారంగా ఒక న్యాయమైన, సంతృప్తి కలి గించే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని ఇవ్వడం, వీటి ద్వారా పారిశ్రామి కీకరణ సజావుగా జరిగిపోతుందనే ఊహా ఈ బిల్లు రూపొం దించడానికి ఆధారం.
బిల్లులోని కొన్ని ముఖ్యాంశాలు
1) 80 శాతం ప్రభావిత కుటుంబాల అంగీకారం ఉన్నప్పుడే వారి భూములను ప్రజావసరాల (పబ్లిక్‌ పర్సన్‌) కోసం సేకరించే అవకాశం ఉంటుంది.
2) రైతులకిచ్చే నష్టపరిహారం గ్రామీణ ప్రాంతాలలో మర్కెట్‌లో ఉన్న భూమి ధరకు రెండు రేట్లు, ఇల్లు, చెట్లు, బావులు, పొలంలో ఉన్న పంటలు మొదలైన అసెట్స్‌ విలువ ఇంకా పైన చెప్పిన నష్టపరి హారం మీద వంద శాతం సోలేషియా – ఇవన్నీ భాగమవుతాయి.
3) కైతుకిచ్చే సమగ్రమైన ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీతో జీవించడానికి అనువైన అలవెన్సులు, ఒక్కొక్క కుటుంబానికి అస్యూటీగా నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఇరవై సంవత్సరాలు, రవాణా ఖర్చుల నిమిత్తం యాభైవేల రూపాయలు, తాత్కాలిక ఉపశమన గ్రాంటుగా నెలకి మూడు వేల రూపాయలు చోప్పున ఒక సంవత్సరం, పశుశాల, చిన్నకొట్ల నిర్మాణానికి ఇరవై ఐదు వేల రూపాయలు, కాలనీలో స్థిరపడడానికి యాభై వేల రూపాయలు, నీటి పారుదల ప్రాజెక్టులయితే కమాండ్‌ ఏరియాలో కనీసం ఎకరా భూమి, పరిశ్రమలయితే కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికి ఉద్యోగం లేని పక్షంలో దీనికి బదులుగా ఐదు లక్షల రూపాయలు ప్రతిపాదించారు.
4) ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్యాకేజ్‌ పెట్టి అందులో 2.5 ఎకరాల సాగుభూమి, డబ్బు రూపేణా యాభై వలే రూపాయల సహాయం ప్రతిపాదించారు.
ఇక్కడ మనం ఒక విసయం గుర్తుంచుకోవాలి. ఎస్సీ, ఎస్టీలను సమాజంలో ఉండే నష్టపోయే వ్యక్తులుగానే గుర్తించి వారి అభివృద్దికి కొన్ని సూచనలు చేసారు. కాని వారిని వారి ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ, దాని ప్రత్యేకతల ద్వారా గుర్తించినపుడే వారి అభివృద్ది సాధ్యమౌతుంది.
5) ఆర్‌&ఆర్‌ కాలనీలో ఇరవై ఐదు రకాల మౌళిక వసతుల సదుపాయాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు
6) సామాజిక తనిఖీని కూడా పొందుపరిచారు.
ఈ బిల్లులో కొన్ని సమస్యాత్మకమైన అంశాలు (అసంప్షన్‌) ఉన్నాయి.
ముసాయిదా బిల్లును రూపొందించిన నిపుణులు రాజధానీ నగరమైన ఢిల్లీ నుండి దేశంలోని ప్రాంతీయ ప్రజల సమస్యలను అవగాహన చేసుకునే క్రమంలో కొన&ఇన అవకతవకలకు (డిస్టార్షన్స్‌కు) దారి తీసింది.
1) దేశమంటే సారుప్యత కల రాష్ట్రాల కలయిక : రాష్ట్రాల మధ్య తేడాలేమైనా ఉంటే అవి వృద్దిలో మాత్రమే తేడాలుగా గుర్తించిన కారణంగా దేశం గ్రామీణ, పట్టణ ప్రాంతాల విభజనగా కనిపించింది.
2) కుటుంబమంటే సాలోచన కల వ్యక్తుల కలయిక : ఆలోచన విధానంలో తేడాలు లేకుండా కలిసి మెలిసి ఉండే వ్యక్తుల కలయికగా కుటుంబాన్ని చూస్తే, ఆధిపత్య వ్యక్తి ఆలోచనే కుటుంబంలోని వ్యక్తుల ఆలోచనగా చలామణీ అవుతుంది.
3) భూమికి బదులుగా డబ్బు రూపంలో నష్టపరిహారం : నిర్వాసిత ప్రజలు పోగొట్టుకున్న భూమికి బదులుగా భూమిని ఇచ్చే నష్టపరిహారం పద్దతిని తొలగించి, భూమికి బదులుగా ఇచ్చే నష్టపరిహారాన్ని దానితో పాటే ఆర్‌ అండ్‌ఆర్‌ ప్యాకేజీలో ఇచ్చే ఇతర సదుపాయాలలో చాలా అంశాలను డబ్బు రూపంలోకి మార్చివేసి, మార్కెట్లు సజావుగా పనిచేయని చోట్లలో కూడా అమలు చేసేటట్లుగా బిల్లును రూపొందించారు.ప్రస్తుత నేపథ్యంలో దేశంలో పరిశ్రమలు నెలకొల్పే ఉద్దేశంతో ఖనిజ సంపద సమృద్దిగా ఉన్న ఆదివాసి ప్రజలు ఎక్కువగా ఉన్న ఒడిశా లాంటి రాష్ట్రాలలో వివిధ కంపెనీల పేరుతో భూసేకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తత్ఫలితంగా ఏర్పడిన వైరుద్య పరిస్థితుల కారణంగా రాష్ట్రాలలో హింస-ప్రతిహింసల క్రమానికి దారితీయడమే గాక ఆర్థిక అస్థిరతకి కూడా దారితీస్తోంది. దేశమంతటా అమలు చేయగలిగే విధంగా కొత్తగా రూపుతీసుఉంటున్న భూసేకరణ చట్టం ప్రభావం ముందు ప్రస్తావించి ఆదివాసీ ఆర్థిక వ్యవస్థ అమలులోఉండే ప్రాంతాలలో అధికంగా ఉంటుందనే నమ్మకంతో ప్రస్తుత వ్యాసం ఈ భూసేకరణ చట్టం అమలు ద్వారా ఆదివాసీ వ్యవస్థలో వచ్చే విపరీత పరిణామాల మీద కేంద్రీకరిస్తుంది.
(ముదునూరి భారతి)