భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 29 (జనం సాక్షి);
ప్రతి సోమవారం ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులో భూ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని , భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలు నుండి అన్ని మండలాల తహసీల్దార్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్సు లో కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించే విధంగా తహసీల్దార్లు కృషి చేయాలన్నారు. రైతుల నుండి వచ్చే సమస్యలను నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఫిర్యాదుల రోజు వచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్ లో నమోదు చేసి ఎన్ని పరిష్కరించారో నివేదిక పంపాలన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలను అందరూ సమిష్టి కృషితో విచారించి , స్పెషల్ డ్రైవ్ గ తీసుకొని పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులు నిరంతర ప్రక్రియ అని వచ్చే దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించి పెండింగ్ లో ఉండకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా వాణి ద్వారా 34 పిర్యాదులు వచ్చా యని,22 భూ సమస్యలు ఉనాయని,మిగతావి ఇతర సమస్యలు వచ్చాయని , సంబందిత అధికారులకు పంపి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని అన్నారు.
ఈ సమావేశంలో కార్యాలయ ఏవో ఆజం అలి,
సూపరింటెండెంట్ రాజు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.