మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి

-ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్

మహబూబాబాద్ బ్యూరో-జులై29(జనంసాక్షి)

మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం చిన్నకిష్టాపురం గ్రామపంచాయతీ దేశ్య తండాలోని ఎస్టీ కాలని మంగలి తండా గ్రామ ప్రజలు గత వారం రోజులుగా తాగడానికి మంచినీరు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలోత్ సురేష్ తెలిపారు. ఒక పక్క మంచినీరు లేకపోవడంతో మిషన్ భగీరథ నీరు బురాధాలుగా వస్తుంటే ఆ కలుషిత బురదనీరు తాగి సీజనల్ వ్యాధులకు, దగ్గు, జలుబు, జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులకు పట్టనట్టే వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.వెంటనే అధికారులు చొరవతీసుకుని మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు మాలోత్ అనిల్ నాయక్, రాజు నాయక్, విజయ్ నాయక్, తరుణ్ నాయక్, రమేష్ నాయక్, వీరన్న నాయక్, సాల్కీ, చంటి నాయక్ తదితరులు పాల్గొన్నారు.