మంత్రి కెటిఆర్ పర్యాటక పకడ్బందీ ఏర్పాట్లు
మంత్రి కెటిఆర్ పర్యాటక పకడ్బందీ ఏర్పాట్లు
ధర్మపురి (జనం సాక్షి )ధర్మపురికి అక్టోబర్ 3.న రాష్ట్ర ఐటీ, శాఖ మంత్రి కేటీఆర్ ధర్మపురిలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్ జిల్లా కలెక్టర్ యాస్మన్ బాషా, ఎస్పీ ఎగ్గడి భాస్కర్, కలిసి మాతా శిశు కేంద్రం, ఫైలాస్, హెలిప్యాడ్ కళాశాల మైదానాన్ని సందర్శించి పనులను పరిశీలించారు.శుక్రవారం ధర్మపురి లో నూతనంగా నిర్మాణం అవుతున్న ఫైలాన్ బహిరంగ సభాస్థలి, కావాల్సిన ఏర్పాట్లు, మాతా శిశు ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్, ఎస్పీ లకు దిశానిర్దేశం చేసారు.కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రామన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ చైర్మన్ సునిల్, అడిషనల్ కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు