మంత్రి సత్యవతికి ఎర్రబెల్లి పరామర్శ

మహబూబాబాద్‌,జూలై30(జనంసాక్షి): మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్‌ దస్మా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. ఆమె మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుగులోత్‌ దస్మా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశాలను మంత్రి ఎర్రబెల్లి ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని హాస్టల్‌ వాª`డ్గంªన్‌కు సూచించారు. కాగా, ఇదే పాఠశాలలో ఇటీవల ఆహారం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

తాజావార్తలు