మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి పార్థీవదేహం వద్ద నివాళులు అర్పించిన కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్ బ్యూరో-జూలై30(జనంసాక్షి)

రాష్ట్ర గిరిజన, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి పార్థీవ దేహం వద్ద జిల్లా కలెక్టర్ కె. శశాంక, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. శనివారం జిల్లా కలెక్టర్ కె. శశాంక, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ కురవి మండలం పెద్ద తండా లోని మంత్రి నివాసంకు వెళ్లి మంత్రి మాతృమూర్తి పార్థీవ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసి మాతృమూర్తి మృతి పట్ల వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తాజావార్తలు