మందు చుక్కకు మంచితనానికి మధ్య యుద్ధం / పోటీ

దొర అరాచకత్వానికి… ప్రజా శ్రేయస్సుకు మధ్య పోటీ ఈ ఎన్నికలు

ఊరూరా కాంగ్రెస్ అజెండాతో పాటు పల్లె నిద్ర

చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్

బానిస సంకెళ్ళ విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధన కోసం, నీళ్ళు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న దోపిడీ నిర్మూలన కోసం ఎందరో మన తెలంగాణ బిడ్డలు అమరులు అయ్యారు. వందల మంది ప్రాణ త్యాగాల ఫలంగా సిద్ధించిన తెలంగాణలో మళ్ళీ అరాచకత్వం, నియంతృత్వ శక్తులు రాజ్యమేలుతున్నాయి అని చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని కొత్తపెళ్లి గ్రామంలో బస చేసి బుధవారం గ్రామంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు బంగారు తెలంగాణ అందించాలనే ఆకాంక్షతో మన బిడ్డలు అమరులు అయ్యారు అని, ఆ మహానుభావుల త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అమరుల ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగడం తో వారి ఆత్మలు ఘోషిస్తున్నాయి ఆవేదన వ్యక్తంచేశారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం జరిగిన పోరాటంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయి అని, కేసీఆర్ ఫామ్ హౌస్ కే నీళ్ళు మల్లించబడుతున్నాయి అని, నిధులు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతున్నాయి అని విమర్శించారు. కేసిఆర్ మానస పుత్రుడైన బాల్క సుమన్ అధికార అహంకారం తో స్థానిక ప్రజలను బానిసలుగా చూస్తూ తన దొరతనాన్ని చూపుతున్నారు అని, చెన్నూరు లోని సహజ సంపద, వనరులు దొచుకేల్లి దొరల ఘడీల్లో దాస్తున్నారు అని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పట్టింపు లేని బాల్క సుమన్ కు స్థానిక ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని, ప్రజలను కనీసం మనుషులుగా గుర్తించలేని వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం ధ్యేయంగా, రాజ్యాంగ బద్దంగా పాలన అందిస్తుంది అని, ప్రజా స్వేచ్చా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం అవుతుంది అని తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలో, రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రానుంది అని, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే రైతులకు ఏక కాలంలో రెండు లక్షల ఋణ మాఫీ, ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్, సామాన్యులకు అందుబాటులో నిత్యావసర సరుకుల ధరలు వుంటాయి అని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గెలుపుకు సహకరించాలి అని, అమూల్యమైన ఓటును అరాచక శక్తులకు వేయద్దు అని, ప్రజా క్షేమం కోరే కాంగ్రెస్ కే వేయాలి అని కోరారు.