*మంబాపూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ*
పెద్దేముల్ సెప్టెంబర్ 28 (జనం సాక్షి)
పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో బుధవారం మహిళలకు ఎఫ్ఏసిఎస్ డైరెక్టర్ నారాయణరెడ్డి, సర్పంచ్ శ్రావణ్ కుమార్, ఎంపీటీసీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.తెలంగాణలోని ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, డీలర్ వీరప్ప తదితరులు పాల్గొన్నారు.