మట్టి గణపతి విగ్రహాలతో పర్యావరణాన్ని రక్షణ

-కలెక్టర్ కె శశంక

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్29(జనంసాక్షి)

మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లా ప్రజలను కోరారు. జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ అద్వర్యంలో కుమ్మర వర్గాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి జీవనోపాదికై వినాయక చవితి పండగ సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేయించి మున్సిపాలిటీలు, కాలుష్య నియంత్రణ బోర్డు ద్వారా కొనుగోలు చేసి జిల్లాలో 3 వేల మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లో మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు, అధికారులకు జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జెడ్పీ సీఈఓ రమాదేవి, బిసి అభివృద్ధి సంక్షేమ అధికారి నరసింహా స్వామి, ఉద్యానవన శాఖాధికారి సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ కె. ప్రసన్న రాణి, పశు సంవర్ధక శాఖాదికారి టి.సుధాకర్, యువజన క్రీడల అధికారి బి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.