మట్టి విగ్రహాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):వినాయక చవితి ఉత్సవాలను కలిసిగట్టుగా జరుపుకోవాలని, మట్టి విగ్రహాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.సోమవారం బిసి సంక్షేమ శాఖ ఆద్వర్యంలో శాలివాహన సంఘం ద్వారా అందించిన మట్టి గణపతి విగ్రహాలను కలెక్టరేట్‌లోని అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బందికి అదనపు కలెక్టర్ ఎస్. మోహన్‌రావుతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మట్టి విగ్రహాలతో వాతావరణ కాలుష్యంతో పాటు, నీటి కాలుషాన్ని నివారించవచ్చని తెలిపారు.జిల్లాలోని ప్రజలు మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని సూచించారు.వినాయక విగ్రహాలను అందించిన శాలివాహన సంఘ నాయకులను ఈ సందర్బంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిసి అభివృద్ది అధికారి అనసూర్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.