మట్టి వినాయక విగ్రహల పంపిణీ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):శ్రీ రామ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బంకమట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.వినాయక చవితి నవరాత్రోత్సవాల సందర్భంగా శ్రీ రామ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు తోట శ్యామ్ ప్రసాద్ అధ్వర్యంలో స్థానిక క్యాంప్ కార్యాలయం నందు జరిగిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి  ప్రారంభించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను మట్టి వినాయకులతో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా పాటుపడాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు,కుంభం రాజేందర్, ట్రస్ట్ సభ్యులు  వీరవెళ్లి విజయ్, వనమా వెంకటేశ్వర్లు, గుడిపాటి సురేష్, పోతుగంటి మనోహర్, తోట శ్రీనివాస్, తెడ్ల వెంకటేశ్వర్లు, బొమ్మిడి అశోక్, పాలవరపు రంగనాధ్, బుగ్గారపు శ్రీనివాస్, దేవరశెట్డి సురేష్, మొరిశెట్టి వెంకటేశ్వర్లు, యామారవి, యాదగిరి, గోదా శ్రీనివాస్,  టిఆర్ఎస్ పార్టీ నాయకులు మారిపెద్ది శ్రీనివాస్, ఎల్గూరి రమాకిరణ్, న్యాయవాది బాణాల విజయ్ కుమార్, కీసర వేణుగోపాల్ రెడ్డి, ముదిరెడ్డి అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.