మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి సిఎండి ఎన్ శ్రీధర్

పినపాక నియో మణుగూరుజకవర్గం జూలై 18 (జనం సాక్షి): ఏరియా లో అధికారిక పర్యటన లో భాగంగా.సింగరేణి కాలరీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ డైరెక్టర్ (ఫైనాన్స్, (పి ఎ అండ్ దబ్ల్యు పి అండ్ పి) బలరామ్ ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ సంబంధిత అధికారులతో కలిసి, సోమవారం మణుగూరు ఏరియా లోని పి కే ఓసి, ఎం ఎస్ జి ఓ సి ఉపరిత గనులను పరిశీలించారు.ఈ పర్యటనలో భాగంగా ముందుగా పీకే ఓసి 4 గనిని సందర్శించి వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, ఓచి వెలికితీత ప్రక్రియను పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత, రవాణా తో పాటు నాణ్యత గురుంచి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిధ అధికారులతో మాట్లాడుతూ డిమాండ్ కి తగ్గ బొగ్గు ఉత్పత్తి రవాణా నిరాటంకంగా జరగాలంటే ముందస్తు ప్రణాళికలతో రోజు వారి బొగ్గు సరఫరా చేయడం తో పాటు బొగ్గు నిలువలు ఎల్లపుడు సిద్ధంగా ఉండేలా సమిష్టి కృషితో లక్ష్యాలను సాదించాలి. శ్రామిక శక్తి, యాంత్రిక శక్తిని పూర్తి పని గంటలు వినియోగించుకుని లక్షాలు సాధించే దిశగా పని చేయాలన్నారు. అలాగే బొగ్గు సరఫరా లో కేసీహెచ్పీ లో బెల్ట్ సిస్టమ్ ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి స్థాయి లో బొగ్గు రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు, అలాగే కోల్ క్వాలిటీ వివరాలు అడుగుతూ, పిల్ పిక్కింగ్ సక్రమంగా జరుపుతూ నాణ్యమైన బొగ్గును వినియోగదారులకు సరఫరా చేయాలని సూచనలు చేశారు. ఆయా గనుల వద్ద నిలువ ఉన్న బొగ్గును వెంటనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా చేయాలని సూచించారు. బి టి పీ ఎస్ కు నిరంతరంగా బొగ్గు సరఫరా చేయాలని చెప్పారు.

గనులలో నిల్చిన నీటిని త్వరితగతిన పంపుల ద్వారా బయటకు పంపించుటకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేసారు.అనంతరం మణుగూరు చుట్టూ నిర్మించిన బండ్ నిర్మాణాన్ని పరిశీలించారు. తరువాత ఇంటెక్ వెల్ దగ్గరగల గోదావరిని నీటి లేవల్ ను పరిశీలించారు మణుగూరు ఏరియా నుంచి 2022 23 వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన సులభతరమయ్యేలా తగు చర్యలు చేబట్టాలి. అందుకుగాను బొగ్గు ఉత్పత్తితో పాటు కేసిహెచ్పి ద్వారా బొగ్గు సరఫరా ప్రక్రియ పై ప్రత్యేక దృష్టి పెట్టి ఎలాంటి సాంకేతిక లోపాలు ఏర్పడకుండా సంబంధిత అధికారులు, సూపర్వైజర్లు కేసిహెచ్పి పని తీరును నిరంతరంగా పర్యవేక్షిస్తూ బొగ్గు రవాణ నిరాటంకంగా కొనసాగేలా చర్యలు చేబట్టలన్నారు. అలాగే ఉపరితల గనుల్లో భారీ యంత్రాలను పని తీరును పర్యవేక్షిస్తూ అవి సాంకేతిక లోపాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి. కంపెనీలో హెమ్మా పని గంటలను పెంచుకుంటూ పోవడం వల్ల మన సంస్థ యొక్క ఉత్పత్తి ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని తద్వారా కంపెనీకి ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని లాభాలలో ఉద్యోగులకు కూడా వాటా వస్తుందని తెలిపారు. భారీ యంత్రాలకు కావలిసిన భాగాలను ఎప్పటికీ అప్పుడు అందుబాటులో ఉంచుకుంటూ, ఎలాంటి బ్రేక్ డౌన్స్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అధికారి జక్కం రమేష్, ఎస్ ఓ టు జి ఎం డీ లలిత కుమార్, పి కే ఓ సి ఫోర్ పిఓ లక్ష్మీపతి గౌడ్, ఎం ఎస్ జి ఓ సి పి ఓ శ్రీనివాసచారి, వెంకటరమణ,నర్సిరెడ్డి ,ఎస్ రమేష్, రవీందర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.