మతతత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదం

– ఎమ్‌ ఐ ఎమ్‌ దోస్తానాతో సాధ్యమైన మతసామరస్యం
– మజ్లిస్‌ పార్టీ భరోసాతోనే రాడికల్‌ ఇస్లాం వైపు ఆకర్షితులు కాని ముస్లిం యువత
– లాల్‌ దర్వాజా గుడికి ఎమ్‌ ఐ ఎమ్‌ నిధులు అడగడం మంచి ఎత్తుగడ
– ప్రధాన జర్నలిస్టు సంఘాలు, మేధావులు మతతత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాలి
– మైనారిటీ జర్నలిస్ట్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో టీఆరెఎస్‌ విధానాలను కొనియాడిన ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌
హైదరాబాద్‌ నవంబరు 28(జనంసాక్షి): రోజురోజుకూ మతతత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ అన్నారు. ‘ఎన్నికలలో కుల, మత, ప్రాంతాల ప్రస్తావన అవసరమా?’ అనే అంశం విూద మైనారిటీ జర్నలిస్ట్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో సోమాజీ గూడ ప్రెస్‌ క్లబ్‌ లో నిర్వహించిన సమావేశానికి కె.శ్రీనివాస్‌ ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీఆరెఎస్‌, ఎమ్‌ ఐ ఎమ్‌ దోస్తానా కారణంగానే నగరంలో మతసామరస్యం సాధ్యమైంది, మజ్లిస్‌ పార్టీ తమకు అండగా ఉంటుందనే భరోసాతోనే ముస్లిం యువత రాడికల్‌ ఇస్లాం వైపు ఆకర్షితులు కాలేదని అన్నారు. ఎవరూ ఊహించని విధంగా లాల్‌ దర్వాజా గుడి అభివృద్ధి కోసం ఎమ్‌ ఐ ఎమ్‌ నిధులు అడగడం టీఆరెఎస్‌ వేసిన మంచి ఎత్తుగడ అని, రాష్ట్రంలో మతసామరస్యం పెంపొందించేందుకు టీఆరెఎస్‌ అమలు చేస్తున్న విధానాలు ప్రశంశనీయమని కె.శ్రీనివాస్‌ కొనియాడారు. అలాగే మతసామరస్యం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రధాన జర్నలిస్టు సంఘాలు, మేధావులు మతతత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాలని కోరారు. మైనారిటీ జర్నలిస్ట్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు యూసుఫ్‌ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టియుడబ్ల్యూజె ప్రధాన కార్యదర్శి ఖాజా విరాహత్‌ అలీ, టియుడబ్ల్యూజెఎఫ్‌ ప్రధాన కార్యదర్శిబి. బసవ పున్నయ్య, ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఎస్‌. విజయ్‌ కుమార్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ యం.ఎస్‌.హాస్మీ, జనంసాక్షి ఎడిటర్‌ ఎం.ఎం.రెహమాన్‌, టియుడబ్ల్యూజెఎఫ్‌ ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య, జనంసాక్షి ఎడిటర్‌ ఎం.ఎం.రెహమాన్‌, టియుడబ్ల్యూజె ప్రధాన కార్యదర్శి (హెచ్‌ 143) ఆస్కాని మారుతి సాగర్‌, తెమ్జు అధ్యక్షుడు ఇస్మాయిల్‌ సయ్యద్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ నస్రీన్‌ ఖాన్‌ ప్రసంగించారు.