Tuesday, 3 November 2026

టెట్‌ దరఖాస్తుల స్వీకరణ ఆలస్యం

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. మంగవారం సమగ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామ ని, వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చే సుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా మంగళవారం ఉదయం నుంచే దరఖాస్తు చేసేందు కు ప్రయత్నించారు. టెట్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేస్తే అప్లికేషన్‌ విండో ప్రత్య క్ష్యం కాలేదు. డీటెయిల్డ్‌ నోటిఫికేషన్‌ ను విడుదల చేయలేదు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆఖరుకు ఈ నెల 7న ఇన్ఫర్మేషన్‌ బులిటిన్‌, నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, అభ్యర్థులు ఆ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ రమేశ్‌ తెలిపారు.