నేటి నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు(ప్రైమరీ స్కూళ్లు) బుధవారం నుంచి సగంపూటే నడవనున్నాయి. ఈ స్కూళ్లను ఉదయం 9 గంటల నుంచి మ ధ్యాహ్నం ఒంటి గంట వరకే నడుపుతారు. రాష్ట్రంలో కుల గణన బుధవారం నుంచి ప్రారంభంకానున్నది.సర్వే కోసం ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెండరీ గ్రేడ్ టీచర్లు, హెచ్‌ఎంల సేవలను వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని 18,241 ప్రాథమిక స్కూళ్లు సగంపూట మాత్రమే తెరుచుకోనున్నాయి. ఈనెల 30 వరకు సర్వే కొనసాగనుండగా, 80 వేల మంది సి బ్బందిని, ప్రభుత్వ ఉద్యోగులను ఈ సర్వే కోసం ప్రభుత్వం రంగంలోకి దించనుంది.