ఆర్టీసీ బస్సుల కోసం లింగంపేటలో రోడ్డెక్కిన విద్యార్థులు

కాంగ్రెస్‌ పాలనలో ఉపాధ్యాయులే కాదు చివరికి విద్యార్థులు కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కామారెడ్డి జిల్లాలింగంపేట మండలం గాంధీనగర్‌లో విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.గత కొన్ని రోజులుగా వచ్చిన బస్సుల్లో నిలబడేందుకు కూడా చోటు దక్కడం లేదని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వచ్చే బస్సులు కనీసం ఆపడం లేదని, స్కూల్‌కు ఆలస్యంగా వెళ్లడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు నిరసన చేపట్టారు. అధికారులు స్పందించి వెంటనే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్‌ చేశారు.

 

తాజావార్తలు