*మతతత్వ బిజెపిని ఓడించండి.
*ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి.
*సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా.
చిట్యాల10 (జనంసాక్షి)మునుగోడు ఉప ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మతతత్వ రాజకీయాలు అత్యంత ప్రమాదకరమని, మతతత్వ ఏజెండా కలిగిన బీజేపీని ఓడించటం తెలంగాణ ప్రజల తక్షణ కర్తవ్యమని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో మతతత్వ రాజకీయాలను ఓడించాలని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలపడడం కోసం అడ్డదారులు తొక్కుతోందని, మునుగోడు ఉపఎన్నిక ప్రజలు కోరుకుంటే రాలేదని, కేవలం బిజెపి అవకాశవాదంతో ఉప ఎన్నిక తీసుకువచ్చిందని తెలిపారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగాన్ని మార్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోందని, ప్రజల మధ్య చీలిక తీసుకు వచ్చి విద్వేష రాజకీయాలతో పరిపాలన కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజలపై అన్నిరకాల భారాలు మొపి అభివృద్ధి నిరోధక పాలన చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని, ప్రజల హక్కులపై తీవ్రమైన దాడి జరుగుతుందని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలపై ఉపా చట్టం లాంటి వాటిని ప్రయోగిస్తున్నారని, తీవ్రమైన అణచివేత ధోరణలు పెరిగాయని తెలిపారు. తెలంగాణలో బిజెపి విస్తరణ అత్యంత ప్రమాదకరమని, చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఫాసిజాన్ని నిలువరించాలని, అందుకోసం మునుగోడు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా తీర్పు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా నాయకులు కసరబోయిన కుమార్, ఆకునూరి జగన్, సంగి రాజు తదితరులు పాల్గొన్నారు.
Attachments area