మత్స్యకారులకు టిఆర్ఎస్ అండగా ఉంటుంది..
సర్పంచ్ కొమ్ము రాజయ్య.
ఊరుకొండ, అక్టోబర్ 1 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మత్స్యకారులకు అండగా చెరువులల్లో చేప పిల్లలను వదిలి, ఆ చేపలను పెంచి మత్స్యకారులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చూస్తున్నారని స్థానిక సర్పంచ్ కొమ్ము రాజయ్య అన్నారు. శనివారం ఊరుకొండ మండల కేంద్రంలోని నల్ల చెరువులో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో మంజూరైన లక్ష 20 వేల చేపపిల్లను ఊర్కొండ మండల సర్పంచ్ కొమ్ము రాజయ్య ఆధ్వర్యంలో చెరువులో వదిలారు.
కార్యక్రమంలో మండల కో ఆప్షన్ ఖలీం పాషా, ఉపసర్పంచ్ నారాయణ, ఊరుకొండ తెరాస నాయకులు పోలె చందు, మత్యకారుల సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.