మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన నాయకులు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ఇమాంపేట మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు పోలేబొయిన కిరణ్ శనివారం పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడతూ ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు.విద్యా సంస్థలు ప్రారంభమై నేటికి మూడు నెలలు గడుస్తున్నా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ , టై బెల్టు, షూలు అందించకుండా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని అన్నారు.పాఠశాలను చేరుకునేందుకు విద్యార్థులకు సరైన దారి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.డీఈఓ తక్షణమే స్పందించి ఇమాంపేట మోడల్ స్కూల్ విద్యార్థులకు తక్షణమే యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు అందేలా, విద్యార్థుల భోజనానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు కొరవి మహేష్, సంతు, వంశీ తదితరులు పాల్గొన్నారు.