మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

 సిఐ టియు జిల్లా నాయకులు యాకూబ్
 సిఐ టియు జిల్లా నాయకులు యాకూబ్
గరిడేపల్లి, ఆగస్టు 30 (జనం సాక్షి): మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని సి ఐ టి యు జిల్లా నాయకులు యాకూబ్ అన్నారు. సోమవారం గరిడేపల్లి తహసిల్దార్ కార్తీక్ కి ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు.  ధర్నా నుద్దేశించి ఆయన మాట్లాడుతూ గత ఐదు నెలలుగా కార్మికులు అప్పులు తెచ్చి కూరగాయలు నిత్యవసర వస్తువులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు తెచ్చి ఏజెన్సీలు నడపడం వలన కార్మికుల పరిస్థితి ఆందోళనలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం విలాసాలకే  ఎక్కువ ఖర్చు చేస్తుందని గత 13 సంవత్సరాలుగా ఆశించకుండా   పనిచేస్తున్న  కార్మికుల  పరిస్థితి  దుర్భరంగా  ఉందని  అన్నారు. పక్క  రాష్ట్రాలైన  తమిళనాడు    కేరళ    ఆంధ్ర  రాష్ట్రంలో కూడా ఏజెన్సీలకు 5,500 వేతనం ఇస్తుంటే దేశంలోని ధనిక రాష్ట్రమని చెప్పిన ఈ ప్రభుత్వం ఏజెన్సీలకు 3000 ఇస్తానని చెప్పి రెండున్నర సంవత్సరాలు అయినప్పటికీ ఇచ్చే రూపాయలు కూడా ఇవ్వటం బాధాకరమని అన్నారు. వెంటనే నెలకు మూడు వేల చొప్పున వేతనాలు చెల్లించాలని లేనియెడల రాబోవు రోజుల్లో వీటి ఫలితాలు వేరే రకంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రమణ, కె నాగమణి ,పెండెం పద్మ ,పి నాగేంద్ర ,బానోతు విజయ, బత్తిన శివమ్మ  ,చిక్కుల శేషగిరి, పెండాల సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆగస్టు 30 (జనం సాక్షి): మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని సి ఐ టి యు జిల్లా నాయకులు యాకూబ్ అన్నారు. సోమవారం గరిడేపల్లి తహసిల్దార్ కార్తీక్ కి ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు.  ధర్నా నుద్దేశించి ఆయన మాట్లాడుతూ గత ఐదు నెలలుగా కార్మికులు అప్పులు తెచ్చి కూరగాయలు నిత్యవసర వస్తువులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు తెచ్చి ఏజెన్సీలు నడపడం వలన కార్మికుల పరిస్థితి ఆందోళనలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం విలాసాలకే  ఎక్కువ ఖర్చు చేస్తుందని గత 13 సంవత్సరాలుగా ఆశించకుండా   పనిచేస్తున్న  కార్మికుల  పరిస్థితి  దుర్భరంగా  ఉందని  అన్నారు. పక్క  రాష్ట్రాలైన  తమిళనాడు    కేరళ    ఆంధ్ర  రాష్ట్రంలో కూడా ఏజెన్సీలకు 5,500 వేతనం ఇస్తుంటే దేశంలోని ధనిక రాష్ట్రమని చెప్పిన ఈ ప్రభుత్వం ఏజెన్సీలకు 3000 ఇస్తానని చెప్పి రెండున్నర సంవత్సరాలు అయినప్పటికీ ఇచ్చే రూపాయలు కూడా ఇవ్వటం బాధాకరమని అన్నారు. వెంటనే నెలకు మూడు వేల చొప్పున వేతనాలు చెల్లించాలని లేనియెడల రాబోవు రోజుల్లో వీటి ఫలితాలు వేరే రకంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రమణ, కె నాగమణి ,పెండెం పద్మ ,పి నాగేంద్ర ,బానోతు విజయ, బత్తిన శివమ్మ  ,చిక్కుల శేషగిరి, పెండాల సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.