మన ఊరు మన బడి క్రింద చేపట్టిన పనులు వేగవంతం చేయాలి.

-జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ .
సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 11:(జనం సాక్షి):
మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ పాఠాలల్లో చేపట్టిన  పనులు వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
మంగళవారం  కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  విద్యాశాఖ,  ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మన ఊరు – మన బడి  పనుల పురోగతి పై కలెక్టర్ మండలం వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మండలం వారీగా   పనుల పురోగతిని ,ఇప్పటి వరకు ఎంత విలువ పని జరిగింది,పూర్తయిన పనులకు రికార్డ్ చేయడం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.కొన్ని మండలాల్లో పనుల జాప్యంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.పనులను వేగవంతం చేసి రానున్న 15 రోజుల్లో లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతి లేని ,నిర్లక్ష్యం వహిస్తున్న ఇంజనీర్ల పై చర్యలు తప్పవని హెచ్చరించారు.
 ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మన బడి క్రింద చేపట్టిన పనులు 15 రోజుల లోగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులు అందరూ చొరవ చూపాలన్నారు.  పూర్తైన పనులకు  బిల్లులు వెంట వెంటనే సమర్పించాలన్నారు.
పూర్తిచేసిన పనులు, ఇంకా పూర్తి కావాల్సిన పనులకు సంబంధించి విద్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు.
జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమంలో 331 పాఠశాలలలో  30 లక్షల లోపు పనులు చేపట్టామని,104 పాఠ శాలల్లో 30 లక్షలకు పైబడిన పనులు చేపట్టినామన్నారు.ఇప్పట్టి వరకు రూ. 10 కోట్ల పనులు పూర్తి కాగా, రూ.7 కోట్లు చెల్లింపులు చేసామని పేర్కొన్నారు. పూర్తయిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి, ఆన్లైన్లో కలెక్టర్ లాగిన్ కి అప్లోడ్ చేయాలన్నారు. కలెక్టర్ లాగిన్ లోకి వచ్చినప్పుడే చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా విద్య అధికారి రాజేష్  పంచాయితీ రాజ్ ఈ ఈ జగదీశ్వర్, టి యస్ ఈ డబ్లు ఐ డి సి  ఈ ఇ శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఈ ఇ మధుసూదన్ రెడ్డి,ఆర్ అండ్ బి,పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్  అధికారులు,
డి ఈ లు,ఏ ఈ లు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area