మన ఊరు మన బడి, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : బుధవారం మల్దకల్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి ప్రభుత్వ పాఠశాలలను, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణాలపనులను  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద పాలవాయి గ్రామంలో రూ.6.67 లు, 16 లక్షలతో చేపట్టిన హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులు, ఎల్కూరు గ్రామంలో మన ఊరు మనబడి క్రింద రూ. 9.81 లక్షలు, సబ్ సెంటర్ల  కొరకు రూ. 16 లక్షలు,  విఠలాపురంలో మన ఊరు మన బడి క్రింద రూ. 6.50 లక్షలు, సబ్ సెంటర్ల  కొరకు రూ. 16 లక్షలు, నాగర్ దొడ్డిలో మన ఊరు మనబడి క్రింద రూ. 29.50  లక్షలు, మల్దకల్ సబ్ సెంటర్  రూ. 16 లక్షలు, మద్దెలబండ జడ్పీ హైస్కూల్ క్రింద రూ. 23 లక్షల ద్వారా చేపట్టిన భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. మద్దెల బండ తండాలో నిర్మించిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ పరిశీలించారు. 13  ఎకరాలలో 13 వేల చెట్లు నాటినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. ప్రతిరోజు మొక్కలకు నీరు పెట్టాలని , పల్లె ప్రకృతి వనం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని,  నీటి సమస్య రాకుండా బోరు వేయించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం అమరవాయి జడ్పీ హైస్కూల్లో మన ఊరు మన బడి క్రింద రూ. 23 లక్షలతో పనులు జరుగుతునాయని, ప్రైమరీ  స్కూల్ లో  రూ. 6.80 లక్షలతో చేపట్టిన పనులను పరిసేలించి  నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా చూడాలని  అధికారులకు ఆదేశించారు. ఉలిగేపల్లి గ్రామంలో రూ. 16 లక్షలతో చేపట్టిన హెల్త్ సబ్ సెంటర్ పనులు, పాఠశాలకు రూ. 6.80 లక్షలతో చేపట్టిన నిర్మాణ పనులను నాణ్యతగా నిర్మించి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  గ్రామాలలో  శానిటేషన్ పనులు నిర్వహించాలని, మురుగు కాలువలు నీరు నిలిచే ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ వెదజల్లాలని, దోమలు ప్రబలకుండా మురుగునీటిలో ఆయిల్ బాల్స్ వేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ  వెంకట్ రెడ్డి, ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్, డి ఈ, ఎ ఈలు, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు