మరో మూడేళ్ళలో జట్టులోకి తిరిగి వస్తా
రీ ఎంట్రీపై పాక్ పేసర్ అవిూర్
లా¬ర్, సెప్టెంబర్ 5(ఆర్‌ఎన్‌ఎ): స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించిన పాకిస్థాన్ పేస్ బౌలర్ మహ్మద్ అవిూర్‌పై పునరాగమనంపై దృష్టి పెట్టాడు. 2015 కల్లా జట్టులోకి తిరిగి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐసిసి అతనిపై విధించిన ఐదేళ్ళ నిషేధం మరో మూడేళ్ళలో పూర్తవుతుంది. అవిూర్‌ను జట్టులో ఎంపిక చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా సానుకూలంగానే ఉంది. 2010 ఇంగ్లాండ్ టూర్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ అవిూర్ స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. అప్పటి కెప్టెన్ సల్మాన్‌భట్ ఆదేశాల మేరకు ఉధ్ధేశపూర్వకంగా నోబాల్స్ వేశాడు. దీనిని న్యూస్ ఆఫ్ ది వరల్డ్ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది. ఈ కేసును విచారించిన లండన్ కోర్టు పాక్ క్రికెటర్లకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే అవిూర్ కెప్టెన్ చెబితేనే చేసినట్టు కోర్టులో తెలపడంతో అతనికి ఆరు నెలల జైలుశిక్ష మాత్రమే పడింది. జైలులో ఖైదీలకు సేవ చేయడంతో మూడు నెలలకే విడుదలయ్యాడు. స్పాట్‌ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన వెంటనే ముగ్గురు పాక్ క్రికెటర్లూ ఏ విధమైన క్రికెట్ ఆడకుండా ఐసిసి నిషేధాన్ని విధించింది. 2015తో అవిూర్ నిషేధం పూర్తవనుంది. అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అవిూర్‌కు మధ్ధతుగా నిలిచింది. అవిూర్ స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే అతనికి పునరావస శిబిరం ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించింది. నిషేధం పూర్తైన వెంటనే ఫిట్‌నెస్ ప్రకారం జట్టులోకి తీసుకుంటామని ప్రకటించింది. పునరావసంలో భాగంగా అవిూర్‌కు అవినీతికి సంబంధించిన నిబంధనలతో పాటు స్పాట్ ఫిక్సింగ్ లాంటి కేసుల వివరాలు తెలియజేశారు. ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ యువబౌలర్ తాను చేసిన తప్పుకు విచారం వ్యక్తం చేశాడు. అందుకు తగిన శిక్షనే అనుభవించానని పేర్కొన్నాడు. జియో సూపర్ ఛానెల్‌కు అతను ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాలు వెల్లడించాడు. పాకిస్థాన్ ఆడుతోన్న మ్యాచ్‌లను చూస్తుంటే తాను ఏది కోల్పోయానో అర్థమవుతోందన్నాడు. మరో మూడేళ్ళ సమయం త్వరగా అయిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పిన అవిూర్ 2015 టార్గెట్‌గా పెట్టుకున్నట్టు వివరించాడు. దాని కోసం ఫిట్‌నెస్ కాపాడుకుంటూ , ప్రాక్టీస్ చేస్తానని తెలిపాడు. తనను ప్రభావితం చేసిన కారణంగానే ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు మరోసారి అవిూర్ స్పష్టం చేశాడు. కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పిదాలు ఉధ్ధేశపూర్వకంగా చేయలేదని , నిజాయితీగానే ఆడినట్టు చెప్పాడు. కెప్టెన్ భట్‌పై విమర్శలు చేసేందుకు మాత్రం అవిూర్ వెనుకంజ వేశాడు. ఎవరు కారణమైనా… తాను కూడా శిక్ష అనుభవించానని తెలిపాడు. దీనిపై ప్రజలకు అప్పుడే క్షమాపణలు చెప్పుకున్నానని వివరించాడు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జాతీయ జట్టుకు మరిన్ని సేవలు అందించడం ద్వారా తప్పును సరిదిద్దుకుంటానని చెప్పాడు. 20 ఏళ్ళ అవిూర్ 2009లో జాతీయ జట్టు అరంగేట్రం చేసి ఆదిలోనే ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకూ 14 టెస్టుల్లో 51 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 15 వన్డేల్లో 25 వికెట్లు , 18 టెస్టుల్లో 23 వికెట్లు పడగొట్టాడు.
మరో మూడేళ్ళలో జట్టులోకి తిరిగి వస్తా
రీ ఎంట్రీపై పాక్ పేసర్ అవిూర్
లా¬ర్, సెప్టెంబర్ 5: స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించిన పాకిస్థాన్ పేస్ బౌలర్ మహ్మద్ అవిూర్‌పై పునరాగమనంపై దృష్టి పెట్టాడు. 2015 కల్లా జట్టులోకి తిరిగి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐసిసి అతనిపై విధించిన ఐదేళ్ళ నిషేధం మరో మూడేళ్ళలో పూర్తవుతుంది. అవిూర్‌ను జట్టులో ఎంపిక చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా సానుకూలంగానే ఉంది. 2010 ఇంగ్లాండ్ టూర్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ అవిూర్ స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. అప్పటి కెప్టెన్ సల్మాన్‌భట్ ఆదేశాల మేరకు ఉధ్ధేశపూర్వకంగా నోబాల్స్ వేశాడు. దీనిని న్యూస్ ఆఫ్ ది వరల్డ్ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది. ఈ కేసును విచారించిన లండన్ కోర్టు పాక్ క్రికెటర్లకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే అవిూర్ కెప్టెన్ చెబితేనే చేసినట్టు కోర్టులో తెలపడంతో అతనికి ఆరు నెలల జైలుశిక్ష మాత్రమే పడింది. జైలులో ఖైదీలకు సేవ చేయడంతో మూడు నెలలకే విడుదలయ్యాడు. స్పాట్‌ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన వెంటనే ముగ్గురు పాక్ క్రికెటర్లూ ఏ విధమైన క్రికెట్ ఆడకుండా ఐసిసి నిషేధాన్ని విధించింది. 2015తో అవిూర్ నిషేధం పూర్తవనుంది. అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అవిూర్‌కు మధ్ధతుగా నిలిచింది. అవిూర్ స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే అతనికి పునరావస శిబిరం ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించింది. నిషేధం పూర్తైన వెంటనే ఫిట్‌నెస్ ప్రకారం జట్టులోకి తీసుకుంటామని ప్రకటించింది. పునరావసంలో భాగంగా అవిూర్‌కు అవినీతికి సంబంధించిన నిబంధనలతో పాటు స్పాట్ ఫిక్సింగ్ లాంటి కేసుల వివరాలు తెలియజేశారు. ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ యువబౌలర్ తాను చేసిన తప్పుకు విచారం వ్యక్తం చేశాడు. అందుకు తగిన శిక్షనే అనుభవించానని పేర్కొన్నాడు. జియో సూపర్ ఛానెల్‌కు అతను ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాలు వెల్లడించాడు. పాకిస్థాన్ ఆడుతోన్న మ్యాచ్‌లను చూస్తుంటే తాను ఏది కోల్పోయానో అర్థమవుతోందన్నాడు. మరో మూడేళ్ళ సమయం త్వరగా అయిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పిన అవిూర్ 2015 టార్గెట్‌గా పెట్టుకున్నట్టు వివరించాడు. దాని కోసం ఫిట్‌నెస్ కాపాడుకుంటూ , ప్రాక్టీస్ చేస్తానని తెలిపాడు. తనను ప్రభావితం చేసిన కారణంగానే ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు మరోసారి అవిూర్ స్పష్టం చేశాడు. కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పిదాలు ఉధ్ధేశపూర్వకంగా చేయలేదని , నిజాయితీగానే ఆడినట్టు చెప్పాడు. కెప్టెన్ భట్‌పై విమర్శలు చేసేందుకు మాత్రం అవిూర్ వెనుకంజ వేశాడు. ఎవరు కారణమైనా… తాను కూడా శిక్ష అనుభవించానని తెలిపాడు. దీనిపై ప్రజలకు అప్పుడే క్షమాపణలు చెప్పుకున్నానని వివరించాడు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జాతీయ జట్టుకు మరిన్ని సేవలు అందించడం ద్వారా తప్పును సరిదిద్దుకుంటానని చెప్పాడు. 20 ఏళ్ళ అవిూర్ 2009లో జాతీయ జట్టు అరంగేట్రం చేసి ఆదిలోనే ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకూ 14 టెస్టుల్లో 51 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 15 వన్డేల్లో 25 వికెట్లు , 18 టెస్టుల్లో 23 వికెట్లు పడగొట్టాడు.