మలేషియా ప్రధానిగా నజీబ్‌

కౌలాలంపూర్‌, (జనంసాక్షి) :
మలేషియా ప్రధానిగా నజీబ్‌ రజాక్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. మలేషియా పార్లమెంట్‌ ఎన్నికల్లో ‘బరిసాన్‌ నేషనల్‌ (బీఎన్‌)’ కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. బీఎన్‌ కూటమి 56 ఏళ్ల పాలనకు తెరదించేందుకు ప్రతిపక్ష కూటమి శాయశక్తులా పోరాడినా.. ప్రజలు మాత్రం అధికార కూటమికే పట్టం కట్టారు. మరోవైపు ఈ ఎన్నికల్లో   పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ఫలితాలను గుర్తించబోమని స్పష్టం చేస్తూ బుధవారం రాజధాని కౌలాలంపూర్‌లో భారీ ర్యాలీకి పిలుపునిచ్చాయి. బీఎన్‌ కూటమి సాధించిన విజయం దేశ ప్రజలందరిదని ప్రధాని నజీబ్‌ రజాక్‌ పేర్కొన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన ముందుకునడిపేందుకు శాయశక్తులా కృషిచ చేస్తానని ఆయన తెలిపారు.