మళ్లీ మునిగిన శివనగర్
*45 కోట్లు వృథా
* ఇదేనా అండర్ రైల్వే గేట్ ప్రాంత ప్రగతి
* ఓట్ల కోసం తప్ప.. ప్రజా సమస్యలు గాలికి..
* పట్టించుకోని ప్రజా ప్రతినిధులు
* బీజేపీ నేత గంట రవికుమార్ ధ్వజం
వరంగల్ ఈస్ట్ ఆగస్టు 03( జనం సాక్షి)
కొద్ది వర్షానికే శివనగర్ మళ్లీ ముని గిందని, ఇదేనా 8ఏళ్ళలో టీఆరెఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. స్థానిక ప్రజా ప్రతి నిధులు చెబుతున్న ప్రగతి అంటూ బీజేపీ నేత గంట రవి కుమార్ బుధవారం మండి పడ్డారు.
45కోట్లతో అభివృద్ధి పేరుతో చేసిన పనులు కొత్త చిక్కులు తెచ్చి శివనగర్ ను మరింత ముంపునకు గురిచేస్తోందని అన్నారు. ఖిలా వరంగల్ అగర్త చెరువు నుంచి చేపట్టిన నీటి మళ్లింపు 33, 34,35 డివిజన్ల కు శాపంగా మారిందని అన్నారు. ప్రస్తుత నాలాను కొందరు కబ్జా చేయగా వాటిని తొలగిస్తే ఓట్లు రావని భావించి కొత్త డైవర్షన్ పేరుతో 45కోట్లు వృథా చేశారని అన్నారు.
ఆగర్త చెరువు నుంచి నీటిని మళ్లించి
శివనగర్ పల్లవి ఆస్పత్రి నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ని పెరిక వాడ నాలాకు అనుసంధానం చేశామని, ఇక ముంపు ఉండదని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.
అసలు కాంటూరు సర్వే(నీటి లెవెల్ తెలిపే సంస్థ) లేకుండా.. వరద ఉద్రితిని అంచనా వేయకుండా పేరిక వాడ నాలాకు కలపడం తో నేటి ప్రవాహం పెరిగి శివనగర్ తో పాటు పెరి క వాడ పూర్తిగా మునిగే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఓట్ల రాజకీయం, ప్రణాళిక లేని అధికారులు తీరు అండర్ రైల్వే గేట్ ప్రాంత వాసులకు శాశ్వత సమస్యలను తెచ్చి పెట్టారని గంట రవికుమార్ మండిపడ్డారు.
పాలకుల ఓట్ల రాజకీయం.. అధికారుల నిర్లక్ష్యం శివనగర్ వాసులకు శాపంగా మారిందని గంట రవికుమార్ ద్వజమెత్తారు.
కాంటుర్ (నీటి లెవల్ సర్వే) లేకుండానే పనులు చేయడం ఏమిటని, దీంతో సమస్య మరింత పెరగడమే కాక, 45కోట్ల ప్రజా ధనం వృథా అయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
శివ నగర్ ప్రాంత వాసులు ఒక్కసారి ఆలోచించాలని, ఎలాంటి ప్రణాళిక లేని ఇలాంటి నాయకులు మనకు అవసరమా అంటూ పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ఎమ్మెల్యే నరేందర్, కార్పొరేటర్ల కు ఎలాంటి చిత్త శుద్ధి లేదని, వారికి కేవలం ఓట్లు మాత్రమే కావాలని అన్నారు. మన సమస్య తీరాలంటే ఇలాంటి నాయకులకు చరమ గీతం పడాలన్నారు.