*మహనీయులు వాల్మీకి రచించిన మహా కావ్యం, రామాయణం నేటి జీవన విధానానికి స్ఫూర్తి చైర్ పర్సన్*

కోదాడ అక్టోబర్ 9(జనం సాక్షి))
రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించిన మహనీయుడు ఆదికవి వాల్మీకి జయంతి ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం కోదాడ పురపాలక సంఘం కార్యాలయం లో జయంతి కార్యక్రమంను మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అధ్వర్యంలోఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ ఉన్నతమైన ఆదర్శాలను, మానవతా విలువలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుందని తెలిపారు. రామకావ్యం వెలుగుల్లో మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. వాల్మీకి గొప్ప కావ్యాన్ని రచించారంటూ కొనియాడారు.
ఈ కార్యక్రమం లో  పలువురు వార్డ్ కౌన్సిలర్స్, డి ఈ పిచ్చయ్య, మునిసిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area