మహాకూటమికే కెయూ జెఎసి మద్దతు
జయశంకర్ భూపాలపల్లి,నవంబర్27(జనంసాక్షి): తెలంగాణలో మహాకూటమికే కేయూ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కేయూ జేఏసీ నాయకుడు మంద భాస్కర్ తెపారు. భూపాలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చరేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం కేయూ జాక్ ఆధ్వర్యంలో ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు కాడపాక రాజేందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హింగె మహేందర్, ఇప్పకాయల నర్సయ్య, ప్టటెం శంకర్, సామల పాపిరెడ్డి పాల్గొన్నారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలు పరిష్కారం కాకపోగా దోపిడీకి గురైందని ఆరోపించారు. తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోతే ఫాంహౌజ్‌కు వెళ్తానని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం ఇస్తేనే ప్రజలకు సేవ చేస్తారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఇంకా ఉపాధి అవకాశాలు లేక కూలీ పనులు చేసుకునే పరిస్థితి ఉందని వాపోయారు. సింగరేణి భూగర్భ బొగ్గుగనులు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి ఉపరితల గనులను తవ్విస్తూ బొందల గడ్డలుగా మార్చుతున్నారని మండిపడ్డారుసమస్యలు పరిష్కరించని ప్రజాప్రతినిధులను ఓడించాలని పిలుపునిచ్చారు.