మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పాలన

మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): దేశంలో విద్య యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన మహోపాధ్యాయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సోమవారం మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్థంతి సందర్బంగా జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్ లో పూలే విగ్రహానికి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ , కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దినజన బంధావుడు పూలే అని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే కన్న కలలు సాకారం చేసేలా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు.పూలే పేరుతోనే బిసిల విద్యకు , ఉపాధికి పెద్దపీట వేసి ఆ వర్గాల వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు. పూలే స్పూర్తితో రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసి పేదలకు కార్పొరేట్ విద్యను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని అన్నారు.సబ్బండ వర్గాల కోసం కేసీఆర్ పలు పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.సమాజాభివృద్ధి కోసం మహాత్మా జ్యోతి రావు పూలే కన్న కలలను సాకారం చేసేది సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.