మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రిని సందర్శించిన

డిసిహెచ్ఎస్  ఆకుల సంజీవయ్య
జులై 11 ( జనంసాక్షి)
 మహాదేవపూర్ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రాని  జిల్లా డి సి హెచ్ ఎస్ డాక్టర్ ఆకుల సంజీవయ్య సందర్శించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటిసారిగా మహాదేవపూర్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెడికల్  సూపరింటెండెంట్ డాక్టర్ గంట చంద్రశేఖర్ స్వాగతం పలికారు. ఆసుపత్రి ఓపి విభాగాని  పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రారంభమైన దృష్ట్యా  అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు . ఉద్యోగులు సమయపాలన పాటించాలని, రోగులకు సక్రమంగా సేవలు అందించాలని సూచించారు.  ఆసుపత్రిలో  ఔట్ పేషెంట్ల సంఖ్యను పెంచాలని, ప్రసూతిల సంఖ్యను పెంచాలని సూచించారు.
వార్డులలోని రోగులతో ముచ్చటించారు. లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ తదితర వార్డులను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. రక్తనిల్వకేంద్రం పనులు ఎంతవరకు పూర్తయ్యాయని  అడిగి తెలుసుకున్నారు.  గర్భిణీ మహిళలకు వైద్య సేవలు అందించడానికి త్వరలో గైనకాలజిస్టులను సమకూరుస్తామని సంజీవయ్య తెలిపారు. ఆయన వెంట  ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గంట చంద్రశేఖర్,  డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ రమేష్, డాక్టర్ స్వాతి, తో పాట హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు