మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం

37 మంది దుర్మరణం
17 మందికి తీవ్రగాయాలు
ముంబై, మార్చి 19 (జనంసాక్షి) :
మహారాష్ట్రలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 37 దుర్మరణం చెం దారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదు గురి పరిస్థితి విషమంగా ఉండడం తో మృతుల సంఖ్య పెరిగే అవకా శం ఉంది. వంతెన పైనుంచి వెళ్తున్న బస్సు అదుపు తప్పి రెయిలిం గ్‌ను ఢీకొని నదిలో పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 54 మంది ప్రయాణికులతో ముంబైకి చెందిన ప్రైవేట్‌ బస్సు గోవా నుంచి ముంబైకి బయల్దేరింది. మంగళ వారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రత్నగిరి జిల్లా విూదుగా

ప్రయాణిస్తున్న బస్సు.. ఖేడ్‌ ప్రాంతంలో జగ్దుబి నదిపై ఉన్న వంతెనపైకి రాగానే అదుపు తప్పింది. అత్యంత వేగంగా వెళ్లిన బస్సు రెయిలింగ్‌ను ఢీకొని నదిలోకి పడిపోయింది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి కిందపడడం, నదిలో నీరు లేకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. 37 మంది మృత్యవాత పడగా, 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారమందుకున్న ఖేడ్‌ పోలీసులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అయితే, డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 40 అడుగుల ఎత్తు నుంచి పడడంతో బస్సు నుజ్జునుజ్జయ్యింది.